సినిమా ఇండస్ట్రీ లో అన్ని విభాగాలకు చెందిన చాలా మంది ఉంటారు.అయిన కూడా ఇక్కడ ఎవరు శాశ్వతంగా ఉండరు అనేది మాత్రం నమ్మలేని వాస్తవం అనే చెప్పాలి.
పాత నీరు పోతూనే ఉంటుంది, కొత్త నీరు వస్తూనే ఉంటుంది అని ఇంతకు ముందు దర్శకరత్న దాసరి నారాయణ రావు కూడా అప్పట్లో చాలా సార్లు చెప్తూ వచ్చారు నిజానికి ఈ మాట వాస్తవం…అయితే ఇప్పుడు కుర్ర హీరోలు కూడా చాలా వేగంగా ఇండస్ట్రీ కి దూసుకు వస్తున్నారు అటు షార్ట్ ఫిలిమ్స్ లోను, ఇటు వెబ్ సిరీస్ లు లోను వల్ల సత్తా చాటుతూన్నారు.ఇలా చాలా మంది డైరెక్టర్లు, యాక్టర్లు ఇండస్ట్రీ లోకి ఎంటర్ అవుతూన్నారు…ఒకప్పుడు ఒక డైరెక్టర్ దగ్గర కొన్ని సంవత్సరాలు అసిస్టెంట్స్ గా చేసిన తర్వాత డైరెక్టర్లు అయ్యేవారు కానీ ఇప్పుడు ఒక షార్ట్ ఫిలిం తీసిన డైరెక్టర్ కూడా డైరెక్ట్ గా సినిమా తీస్తున్నాడు అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటంటే ఇండస్ట్రీ కానీ జనాలు కానీ ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయారు.అయితే ఇండస్ట్రీ లో సత్తా చాటుతున్న కొంత మంది డైరెక్టర్లు షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే వచ్చారు వాళ్లెవరో తెలుసుకుందాం…

పెళ్లి చూపులు( Pelli Choopulu ) అనే సినిమా తో ఇండస్ట్రీ కి పరిచయం అయిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్( Tharun Bhascker ).ఈయన చేసిన సైన్మా అనే షార్ట్ ఫిలిం మంచి పేరు సంపాదించుకోవడం తో ఈయన డైరెక్ట్ గా పెళ్లి చూపులు అనే సినిమా తీసాడు అది మంచి విజయం సాధించింది ఇక దాంతో ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఈయన ఒక మంచి డైరెక్టర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు…

రన్ రాజా రన్( Run Raja Run ) సినిమా తో ఇండస్ట్రీ లో డైరెక్టర్ మంచి పేరు సంపాదించుకున్న డైరెక్టర్ సుజిత్( Sujeeth ).ఈయన చేసిన కొన్ని షార్ట్ ఫిలిం ల వల్ల ఈయనకి శర్వానంద్తో సినిమా చేసే అవకాశం వచ్చింది.ఆ సినిమా విజయం సాధించడం తో ప్రభాస్ తో సాహో అనే సినిమా చేసాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఓజి సినిమా చేస్తున్నాడు…
.







