Bjp:ఈటల ఇన్..ఆ ఇద్దరు నేతలు ఔట్.. నిజమేనా..?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో బిజెపి( BJP ) అంటే కనీసం ఎక్కడ కనబడేది కాదు.కానీ 2018 ఎన్నికల్లో తెలంగాణలో అరంగేట్రం చేసిన బిజెపి కొన్ని ఎమ్మెల్యే స్థానాలు, కొన్ని ఎంపి స్థానాలు సంపాదించుకోగలిగింది.

 Bjp:ఈటల ఇన్..ఆ ఇద్దరు నేతలు ఔట్.. న-TeluguStop.com

ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర బిజెపి రథసారథిగా బండి సంజయ్ ఎన్నికయ్యారు.దీంతో బండి సంజయ్( Bandi Sanjay Kumar ) రాష్ట్రమంతా పర్యటిస్తూ హిందుత్వ వాదాన్ని పట్టుకొని బిజెపిని కూడా తెలంగాణలో రాబోవు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు(BRS) పోటీగా ఉంటుందని నిరూపించారు.

కానీ అతిగా హిందుత్వవాదమే ఎల్లప్పుడు మాట్లాడేసరికి తెలంగాణ( TELANGANA ) ప్రజలకు బిజెపిపై అంతగా నమ్మకం కుదరలేదు.కట్ చేస్తే ఇదే తరుణంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈటల రాజేందర్ బిజెపిలో చేరారు.

దీంతో బిజెపిలో వర్గాలు ఏర్పడ్డాయి.ఓవైపు ఈటల వర్గం, మరోవైపు బండి సంజయ్ వర్గం అనే విధంగా తయారయింది.

Telugu Bandisanjay, Brs, Kishan Reddy, Mla Rajasingh, Ts-Politics

ఈ క్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్( MLA Rajasingh ) బిజెపి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎక్కడ మాట్లాడిన హిందుత్వ నినాదం, గుళ్ళు, గోపురాలు తప్ప తెలంగాణ ప్రభుత్వం చేసేటువంటి తప్పులను కానీ, బిజెపి అధికారంలోకి వస్తే ఏం చేస్తుందని కానీ మాట్లాడిన దాఖలాలు లేవు.దీంతో విసుకు చెందిన ఈటల రాజేందర్( Etela Rajender ) తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావాలి అంటే హిందుత్వ వాదం పనిచేయదని బిజెపి హై కమాండ్ కు తెలియజేశారు.దీంతో బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించింది బిజెపి అధినాయకత్వం.ఈ సమయంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ముస్లింలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేగింది.

దీంతో బిజెపి అధిష్టానం రాజాసింగ్ పై వేటు వేసింది.

Telugu Bandisanjay, Brs, Kishan Reddy, Mla Rajasingh, Ts-Politics

అప్పటినుంచి రాజాసింగ్ సొంతంగానే పోరాడుతున్నారు. బిజెపి( BJP ) పార్టీ మళ్ళీ తనను అక్కున చేర్చుకుంటుందని ఆశపడుతున్నారు.కానీ ఇది జరిగేలా కనిపించడం లేదు.

అయితే తాజాగా గోషామహల్ లో ఈటల రాజేందర్ మరో వ్యక్తిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.ఈ విషయంపై ఈటల రాజేందర్ ను మీడియా ప్రశ్నిస్తే రాజా సింగ్ విషయమే అధిష్టానంతో మాట్లాడుతున్నానని, అతన్ని మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చే అవకాశం ఉందని చెబుతూనే, గోషామహల్ లో( GOSHA MAHAL ) మరో బిజెపి అభ్యర్థి నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడని ఒక వార్త బయట వినిపిస్తోంది.

ఏది ఏమైనా ఈటల రాజేందర్ పార్టీలోకి వచ్చాక కాస్త అధిక హిందుత్వ వాదం ఉన్నటువంటి నాయకులంతా సైలెంట్ అయిపోయారని చెప్పకనే చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube