బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య కులసంఘాలు వారధిగా ఉండాలని తెలిపారు.
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.ప్రజలందరి సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని వెల్లడించారు.
రాష్ట్రంలోని చేనేత పరిశ్రమను గత ప్రభుత్వాలు ఏవీ పట్టించుకోలేదని విమర్శించారు.కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన నాయకత్వంలో చేనేత పరిశ్రమ బలోపేతం అయిందని స్పష్టం చేశారు.







