కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు మంచు విష్ణు.కెరీర్ మొదట్లో ఢీ, విష్ణు, అస్త్రం వంటి చిత్రాలతో మంచి హిట్స్ అందుకున్నా….ఇప్పుడు మాత్రం వరుస ప్లాప్ సినిమాతో కాస్త సతమవుతున్నాడు.ఆన్ స్క్రీన్ ఏ కాడుందా ఆఫ్ స్క్రీన్ కూడా ఈయన చాలా కాంట్రావర్సీలలో ఇరుక్కుంటున్నారు.మా ఎలక్షన్స్( MAA Elections ) టైం లో ఈయన ఆడిన మాటల కారణంగా భీభత్సమైన ట్రోలింగ్ కి గురయ్యాడు.ఐతే ఇంటర్వ్యూలలో మిడి మిడి జ్ఞానంతో మాట్లాడి ట్రోలింగ్ కి గురయ్యే మంచు విష్ణు ఈ మధ్య ఒక ఇంట్వ్యూ లో చాలా చాకచక్యంగా మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ఇప్పుడు ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈయనలో ఈ కోణం కూడా ఉందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో ఇంటర్వ్యూయర్ మంచు విష్ణు ని ప్రకాష్ రాజ్ గురించి ప్రశ్నించారు.ప్రకాష్ రాజ్ మంచు విష్ణు ని తాను ఇండస్ట్రీ కి నేషనల్ అవార్డు తెచ్చానని, నువ్వేం తెచ్చావ్ అని ప్రయాణించారని అన్నారు.దీనికి స్పందిస్తూ మంచు విష్ణు ప్రకాష్ రాజ్ కి నేషనల్ అవార్డు రావటానికి కారణం తెలుగు సినిమా అని అన్నారు.
ఐతే ప్రకాష్ రాజ్ చాలా మంచి నటుడని, ఆ విషయాన్నీ తాను ఎప్పుడు కాదనలేదని అన్నారు.

కానీ ప్రకాష్ రాజ్ ( Prakash raj )కంటే తాను మా అధ్యక్ష పదవికి అధిక న్యాయం చేయ్యగలనని అన్నారు.తరువాత మీరు పొలిటిషన్స్ కూడా మించిపోయేలా మాట్లాడుతున్నారు అని ఇంటర్వ్యూయర్ జోక్ చెయ్యగా విష్ణు( Manchu vishnu ) మనిషి అనే వాడు నిత్య విద్యార్ధి గా ఉండాలి అని అన్నారు.“నేను ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ ని.నేను చదువు ఆపేసిన తరువాత కూడా ఎప్పుడు బుక్స్ చదువుతాను.మా ఇన్స్టిట్యూషన్ లో ఫాకల్టీ కి కూడా నేను టీచర్ అనే వాడు విద్యార్థితో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ నిత్యవిద్యార్థిగా ఉండాలి అని చెబుతాను” అన్నారు.







