చిరంజీవి ఆ సినిమాలు రీమేక్ చేయబోతున్న రామ్ చరణ్...

చిరంజీవి( Chiranjeevi ) హీరో గా చేసిన చాలా సినిమాల్లో ఒకప్పటి వేట సినిమా మంచి గుర్తింపు పొందింది.నిజానికి ఈ సినిమా లో చిరంజీవి నెగిటివ్ టచ్ ఉన్న రోల్ లో నటించి అందరి మన్ననలు పొందారనే చెప్పాలి.

 Ram Charan Is Going To Remake Chiranjeevi's Movies , Chiranjeevi, Ram Charan, Ja-TeluguStop.com

ఇక అసలు విషయం లోకి వస్తే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కానప్పటికీ ఆ పాత్ర లో చేసినందుకు చిరంజీవి కి మాత్రం మంచి పేరు అయితే వచ్చిందనే చెప్పాలి.

Telugu Chiranjeevi, Jagadekaveerudu, Ram Charan, Ramcharan, Shankar, Tollywood-M

ఇక ఈ సినిమాలో మంచి పేరు రావడం తో పాటు గా చిరంజీవి కెరియర్ లో బెస్ట్ పది పాత్రలు తీస్తే అందులో ఇది కూడ ఉంటుంది అనడం లో ఎంత మాత్రం సందేహం లేదు…అయితే ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే చిరంజీవి చేసిన సినిమాల్లో రామ్ చరణ్( Ram Charan ) ఏ సినిమాని రీమేక్ చేస్తే బాగుంటుంది అనే విషయం మీద సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది.కొందరు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాని రామ్ చరణ్ మళ్లీ తాను హీరో గా ఇంకోసారి తీస్తే చూడాలి అని అనుకుంటుంటే, ఇంకొందరు మాత్రం జ్వాలా సినిమా లో చిరంజీవి పోషించిన పాత్ర లో రామ్ చరణ్ ని చూడాలి అని కోరుకుంటున్నారు.

 Ram Charan Is Going To Remake Chiranjeevi's Movies , Chiranjeevi, Ram Charan, Ja-TeluguStop.com
Telugu Chiranjeevi, Jagadekaveerudu, Ram Charan, Ramcharan, Shankar, Tollywood-M

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ లో పోషించిన పాత్ర కూడా కొంచం నెగిటివ్ గా ఉన్న క్యారెక్టర్ కావడం తో దాంట్లో చాలాబాగా నటించి మెప్పించాడు… ఇక ఈ పాత్ర కూడా అలంటిదే కాబట్టి రామ్ చరణ్ చాలా ఈజీగా ఈ పాత్ర ని పోషిస్తాడు అంటూ చాలా మంది రామ్ చరణ్ మీద మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.అయితే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్( Shankar ) డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు, అలాగే బుచ్చిబాబు డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమాలు ముగిసాక చిరంజీవి కి సంబందించిన ఒక సినిమా రీమేక్ చేయాలనే ఆలోచనలో రామ్ చరణ్ ఉన్నట్టు గా తెలుస్తుంది.నిజానికి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది అనే దాని కంటే చిరంజీవి చేసిన క్యారెక్టర్ లో రామ్ చరణ్ ఎంత బాగా చేస్తాడో చూడాలి అని చాలా మంది ఆరాట పడుతున్నారు…రామ్ చరణ్ కూడా చాలా మంచి నటుడు అనేది రంగస్థలం, ఆర్ ఆర్ ఆర్ సినిమాలు చూస్తేనే మనకు అర్థం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube