తెలంగాణ త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది.ఇందులో భాగంగా పార్టీ అభ్యర్థుల ఎంపికపై టీపీసీసీ ఫోకస్ పెట్టింది.
ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం టీపీసీసీ ఎన్నికల కమిటీ భేటీకానుంది.హైదరాబాద్ లోని గాంధీభవన్ లో జరిగే ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది.
కాగా ఈ సమావేశానికి పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, ముగ్గురు ఇంఛార్జ్ కార్యదర్శులు హాజరుకానున్నారు.ఎన్నికల్లో పోటీకి ఇటీవల వచ్చిన ఆశావహుల దరఖాస్తులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది.
ఈ క్రమంలోనే మొత్తం 119 నియోజకవర్గాలకు గానూ 1,025 దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఇవాళ్టి టీపీసీసీ సమావేశంలో 35 నుంచి 40 మంది అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రదేశ్ ఎన్నికల కమిటీ రూపొందించిన అభ్యర్థుల జాబితాను తరువాత స్ర్కీనింగ్ కమిటీకి పంపనున్నారు.







