వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ( CM KCR )అనేక వ్యూహాలు రచిస్తున్నారు.అన్ని పార్టీల కంటే ముందుగా అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ఏడు స్థానాలు మినహా మిగిలిన అన్నిచోట్ల దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి అవకాశం కల్పించారు.
అయితే టికెట్లపై ఆశలు పెట్టుకున్న చాలా మంది పార్టీ మారే ఆలోచనతో ఉండడం, ప్రస్తుతం టికెట్లు ప్రకటించిన సిటింగ్ ఎమ్మెల్యేలు చాలామందిపై ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో కెసిఆర్ సర్వే బృందాలను రంగంలోకి దించారు.</br
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ( BRS party )పరిస్థితి ఏ విధంగా ఉంది.ప్రస్తుతం టికెట్లు ప్రకటించిన అభ్యర్థుల బలం ఎంతవరకు ఉంది.వారికి నియోజకవర్గంలో ఉన్న ప్రజాదరణ, గెలుపు అవకాశాలు ఇలా అన్నిటిపైనా మరోసారి సర్వే చేస్తున్నారు.
ఆ సర్వే రిపోర్ట్ కు అనుగుణంగా అవసరమైతే అభ్యర్థులను మార్చేందుకు కూడా కెసిఆర్ సిద్ధమవుతున్నారట.ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా 34 నియోజకవర్గాల్లో ఫ్లాష్ సర్వే చేస్తున్నట్లు సమాచారం.ప్రస్తుతం టికెట్లు ప్రకటించిన అభ్యర్థులపై వ్యతిరేకత కారణంగా బీఆర్ఎస్ కు అధికారం దక్కడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఈ సర్వేల ద్వారా వాస్తవ పరిస్థితిని అంచనా వేయాలని కెసిఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం
అందుకే కొన్నిచోట్ల ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు.అవసరమైతే టిక్కెట్లు ప్రకటించిన అభ్యర్థులను మార్చి వారి స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చే ఆలోచనలు కూడా ఉన్నారట.ఇప్పుడు ప్రకటించిన 115 మంది అభ్యర్థుల లిస్టు ఫైనల్ కాదని సర్వే నివేదికల ఆధారంగా అవసరమైతే మార్పు చేర్పులు చేపట్టేందుకు కూడా కెసిఆర్ సిద్ధంగానే ఉన్నారట.బీఆర్ఎస్ టికెట్ల కేటాయింపు పై ఇప్పటికే కరీంనగర్ ఎంపీ బండి( Bandi Sanjay ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సగం మందికి కూడా టికెట్లు ఇచ్చే అవకాశం లేదని , ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.ప్రస్తుతం బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) అమెరికా టూర్ లో ఉండడంతో , ఆయన తిరిగి వచ్చిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.