టాలీవుడ్ ఇండస్ట్రీలోని యంగ్ హీరోలలో ఒకరైన నాగ చైతన్య( Naga Chaitanya ) గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేదు.వరుస ఫ్లాపులు నాగచైతన్య మార్కెట్ ను ఊహించని స్థాయిలో తగ్గించాయి.
అదే సమయంలో చైతన్య వ్యక్తిగత జీవితానికి సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.తాజాగా నాగచైతన్య థియేటర్ లో ఖుషి మూవీ ట్రైలర్( Kushi Movie Trailer ) చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం.

అయితే ఈ వార్తలు తన దృష్టికి రావడంతో నాగచైతన్య స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.ఖుషి ట్రైలర్ వచ్చిన వెంటనే థియేటర్ నుంచి వెళ్లిపోయానంటూ జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ఆయన తెలిపారు.కొన్ని తెలుగు వెబ్ సైట్లలో వచ్చిన రూమర్లు నా దృష్టికి వచ్చాయని నాగచైతన్య కామెంట్లు చేశారు.ఆ వార్తలను సరి చేయాలని ఇప్పటికే వాళ్లకు సూచించామని నాగచైతన్య చెప్పుకొచ్చారు.
నేను సమంత( Samantha ) ఇప్పటికే అధికారికంగా విడాకులు తీసుకోవడం జరిగిందని ఆయన కామెంట్లు చేశారు.ప్రస్తుతం నేను సమంత ఎవరి జీవితాలు వాళ్లు బ్రతుకుతున్నామని నాగచైతన్య పేర్కొన్నారు.
సమంత ప్రియమైన వ్యక్తి అని సమంత జీవితం సంతోషంగా సాగాలని కోరుకుంటున్నానని నాగచైతన్య తెలిపారు.చైతన్య ప్రస్తుతం చందూ మొండేటి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.

చైతన్య చందూ మొండేటి( Chandu Mondeti ) కాంబినేషన్ లో ప్రేమమ్, సవ్యసాచి సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలలో ప్రేమమ్ హిట్ గా నిలిస్తే సవ్యసాచి ఫ్లాప్ గా నిలిచింది.ఈ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.నాగచైతన్యకు తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ విజయాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.నాగచైతన్య పారితోషికం ప్రస్తుతం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.







