శ్రీలీల రామ్ పోతినేని కాంబినేషన్లో బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న స్కంద( Skanda ) సినిమాకి సంబంధించి విడుదలైన ట్రైలర్,టీజర్, పోస్టర్, సాంగ్స్ ఇప్పటికే అందర్నీ ఆకట్టుకున్నాయి.అంతే కాదు ఇందులో నుండి విడుదలైన పాటలు కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి.
అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ చేస్తున్నారు.ఇక బోయపాటి శ్రీను సినిమా అంటే కచ్చితంగా మాస్ ఎలివేషన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇక ఇస్మార్ట్ శంకర్ లాంటి మరొక హిట్ తన ఖాతాలో పడుతుంది అని రామ్ పోతినేని( Ram Pothineni ) అభిమానులు భావిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రీసెంట్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఘనంగా చేసి బాలకృష్ణ( Balakrishna ) ని కూడా గెస్ట్ గా పిలిచారు.అయితే ఈ ఈవెంట్ లో శ్రీలీల స్టేజ్ పై మాట్లాడుతూ డైరెక్టర్ గురించి హీరో గురించి బాలకృష్ణ గురించి అన్ని మాట్లాడి అలాగే చివర్లో నేను రామ్ పోతినేని తో కలిసి నటించేది ఇది మొదటి సినిమా అని మీరందరూ అనుకుంటున్నారు కావచ్చు.కానీ మీరు అలా అనుకుంటే పొరపాటు పడ్డట్లే.

ఎందుకంటే నేను రామ్ పోతినేని తో కలిసి చేసేది ఇది మూడో సినిమా అంటూ ఒక షాకింగ్ న్యూస్ బయట పెట్టింది.అయితే ఈ వార్త వినగానే ప్రతి ఒక్క నెటిజన్ ఏంటి వీరి కాంబినేషన్లో స్కంద సినిమా నే మొదటిది కదా.అంతకుముందు నటించిన రెండు సినిమాలు ఏంటి అని అయోమయంలో పడిపోయారు.కానీ అసలు విషయం ఏమిటంటే.
రామ్ పోతినేని తో కలిసి శ్రీలీలకు నటించే అవకాశం ఇప్పటికే రెండుసార్లు వచ్చిందట.కానీ ఆ రెండు సినిమాలని శ్రీలీల( Sreeleela ) రిజెక్ట్ చేసిందట.
ఇక మూడో సినిమాగా వచ్చిన స్కంద సినిమాలో రామ్ పోతినేని తో కలిసి నటించడానికి ఓకే చెప్పింది.ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీ లీల తనకి రామ్ పోతినేని తో ఇది మూడో సినిమా అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది.







