ఇంగ్లాండ్‌లో( England ) దారుణం జరిగింది.పశ్చిమ ఇంగ్లాండ్‌లోని ష్రూస్‌బరీలో భారత సంతతికి చెందిన 23 ఏళ్ల డ్రైవర్‌ను దారుణంగా హతమార్చారు దుండగులు.
ఈ ఘటనతో ప్రమేయం వున్న నలుగురు భారత సంతతి వ్యక్తులను అరెస్ట్ చేసి వారిపై అభియోగాలు మోపారు.గత సోమవారం నగరంలోని బెర్విక్ అవెన్యూ ప్రాంతంలో జరిగిన దాడికి సంబంధించిన నివేదికలను పరిశీలించిన స్థానిక వెస్ట్ మెర్సియా పోలీసులు.
హత్యకు పాల్పడ్డారనే అనుమానంతో నలుగురిని అరెస్ట్ చేశారు.మృతుడు ఔర్మాన్ సింగ్ ( Aurman Singh )సంఘటన స్థలంలోనే మరణించాడు.
శుక్రవారం అర్ష్‌దీప్ సింగ్( Arshdeep Singh ) (24), జగ్‌దీప్ సింగ్( Jagdeep Singh ) (22), శివదీప్ సింగ్( Shivdeep Singh ) (26), మంజోత్ సింగ్( Manjot Singh ) (24), ఔర్మాన్ సింగ్‌ను హత్య చేసినట్లుగా అభియోగాలు మోపారు.అలాగే నేరస్థులకి సహాయం చేశాడనే అనుమానంతో అరెస్టు చేసిన ఐదవ అజ్ఞాత వ్యక్తి పోలీసు బెయిల్‌పై విడుదలయ్యాడు.
ఈ క్లిష్ట సమయంలో ఔర్మాన్ కుటుంబం, స్నేహితులకు అండగా వుంటున్నట్లు వెస్ట్ మెర్సియా పోలీస్ సీనియర్ అధికారి, డిటెక్టివ్ చీఫ్ ఇన్స్‌పెక్టర్ మార్క్ బెల్లామీ అన్నారు.ఔర్మాన్ హత్యకు దారి తీసిన పరిస్ధితులను నిర్ధారించడానికి విచారణ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
మృతుడు డెలివరీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని.దీనిని దోపిడీ కోణంలో జరిగిన హత్యగా పరిగణించడం లేదని మార్క్ చెప్పాడు.

హత్యకు కారణమైనవారు పరిచయస్తులేనని.ఔర్మాన్ హత్యకు సంబంధించి తాము ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేశామని చెప్పారు.నిందితులు ఇంగ్లాండ్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్ ప్రాంతంలోని టిప్టన్, డడ్లీ, స్మెత్‌విక్‌లకు చెందినవారని ఆయన పేర్కొన్నారు.దాడికి సంబంధించిన సమాచారం లేదా డిజిటల్ ఫుటేజ్ వున్న వారు తక్షణం పోలీసులను సంప్రదించాలని ప్రజలకు మార్క్ పిలుపునిచ్చారు.

మరోవైపు.ఔర్మాన్ హత్యపై అతని కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.కొడుకు లేకుండా ఓ తల్లి వృద్ధాప్యంలో జీవితాన్ని సాగిస్తుందని , ఓ సోదరి తన సోదరుడు లేకుండా పెరుగుతుందన్నారు.తమకు జరిగిన దారుణం మరో కుటుంబానికి జరగకూడదని వారు ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ క్లిష్ట సమయంలో దర్యాప్తు సజావుగా నిర్వహించి మాకు మద్ధతుగా నిలిచినందుకు పోలీసులకు ఔర్మాన్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.







