కంగనా రనౌత్( Kangana Ranaut ).ఈ పేరు తెలియని ఇండియన్ ప్రేక్షకులు లేరు.
ఈమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుంది.బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో కూడా ఈమె సుపరిచితమే.
ఈమె నటన పరంగా ఎవ్వరు వేలెత్తి చూపించేలేరు.అయితే బయట మాత్రం అన్ని విషయాల్లో కల్పించుకుని ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
అందుకే ఈమెకు ఫైర్ బ్రాండ్ అనే పేరు ఉంది.టాప్ హీరోలను సైతం తన కామెంట్స్ తోనే ముచ్చెమటలు పట్టించగల సత్తా ఉంది.ఈమె లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ వరుస హిట్స్ కొట్టి టాప్ హీరోయిన్ గా ఎదగడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.అయితే ఈ భామకు ఈ మధ్య వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి.
ఇటీవల కాలంలో ఈమె చేసిన సినిమాలు ప్లాప్ అవుతున్నాయి.

అయినప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగానే ఉంది.ఇక ఈ బ్యూటీ మరోసారి ఒక ట్వీట్ చేసింది.ఈ ట్వీట్( Tweet ) ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.
కంగనా చేసిన ట్వీట్ కు చాలా కాలం తర్వాత పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.నెటిజెన్స్ ఈమె ట్వీట్ కు ఫిదా అవుతున్నారు.మరి ఇంతకీ కంగనా చేసిన ఆ పోస్ట్ లో ఏముందంటే.”దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలలో బొట్టు బిళ్ళ, తిలకం, మంగళ సూత్రం ధరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.వారి అత్యున్నతమైన ఆలోచనలకూ, నిరాడంబర జీవితాలకు ఇవి నిదర్శనం.అదే అసలైన భారతీయత లక్షణం అంటూ ఈమె పోస్ట్ చేసింది.ఈ పోస్ట్ చుసిన వారంతా ఇదంతా నిజం అంటూ పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి చాలా రోజుల తర్వాత ఈమె పోస్ట్ పై పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది అని చెప్పాలి.ఇక అతి త్వరలోనే ఈ భామ చంద్రముఖి 2 సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా అభిమానులను పలకరించబోతుంది.ఈ సినిమా అయినా ఈ అమ్మడికి హిట్ ఇస్తుందో లేదో చూడాలి.







