సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం”( Guntur Karam ).మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఎదురు చూడని అభిమాని లేడు.
ఈ సినిమా నుండి ఏదొక వార్త వైరల్ అవుతూనే ఉంది.మరి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ రూమర్ నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్( Guest Role) ఉందట.అది కూడా నెగిటివ్ గా ఉంటుందని టాక్.ఇది విలన్ పాత్ర అని చాలా వైల్డ్ గా ఈ రోల్ ను త్రివిక్రమ్( Trivikram ) డిజైన్ చేసారని టాక్.ఇక సెకండాఫ్ మొత్తం ఈ విలన్ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుందని తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది.
మరి ఇంత వరకు ఈ రోల్ కోసం ఎవరిని సెలెక్ట్ చేయలేదట.చూడాలి ఏ స్టార్ ను ఈ రోల్ కోసం ఒప్పిస్తారో.
కాగా ఈ సినిమా గుంటూరు మిర్చి యాడ్( Guntur Mirchi Ad ) నేపథ్యంలో కథ ఉంటుందని.మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాదు ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా బలంగా కథలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారని ఇప్పటికే సమాచారం బయటకు వచ్చింది.
మొత్తానికి లేట్ గా స్టార్ట్ అయినప్పటికీ ఈ సినిమా అన్ని ఎలివేషన్స్ ఉండేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.

కాగా ఈ సినిమాలో శ్రీలీల( Sreeleela ), మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తుండగా హారిక హాసిని బ్యానర్( Haarika Haasini ) పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.జగపతిబాబు, ప్రకాష్ రాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.ఈ సినిమా తెలుగులో మాత్రమే కాదు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.







