ఒకప్పుడు హిందీ మరియు మలయాళ సినిమాలకు మాత్రమే జాతీయ అవార్డులు( National Awards ) వస్తాయి అనే అభిప్రాయం ఉండేది.తెలుగు సినిమా లు( Telugu Movies ) కనీసం ఆ దరిదాపుల్లో కూడా ఉండేవి కాదు.
దాంతో జాతీయ అవార్డులను ఎంపిక చేసే వారి విషయం లో తెలుగు వారు తీవ్ర అసంతృప్తి తో ఉండేవారు.సోషల్ మీడియా లో కూడా జాతీయ అవార్డు ల విషయం లో రకరకాలుగా ప్రచారం జరుగుతూ ఉండేది.
ఆ విషయం పక్కన పెడితే ఈసారి తెలుగు సినిమా లు జాతీయ అవార్డుల్లో సందడి చేశాయి.దాదాపుగా డజనుకు పైగా అవార్డులను తెలుగు సినిమా లను దక్కించుకున్నాయి.
ఒకసారి జాతీయ అవార్డులు రావడం మొదలు అయితే వరుసగా జాతీయ స్థాయి అవార్డులు రావడం ఖాయం అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు సినిమా లను ఇక ముందు జాతీయ అవార్డు జ్యూరీ మెంబర్స్ ప్రత్యేకంగా చూడటం వంటివి చేస్తారు.తద్వారా తప్పకుండా ఇక నుండి వరుసగా జాతీయ అవార్డు లు తెలుగు సినిమా లకు వస్తాయి అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఏడాది అల్లు అర్జున్ కు( Allu Arjun ) ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు దక్కింది.
పుష్ప సినిమా లో ( Pushpa ) నటించినందుకు గాను అల్లు అర్జున్ కి దక్కింది.ఆయన్ను ఆదర్శంగా తీసుకుని మరింత మంది అద్భుతమైన నటనతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపించే అవకాశాలు ఉన్నాయి.

అంతే కాకుండా జాతీయ అవార్డు కొల్లగొట్టే విధంగా ఫిల్మ్ మేకర్స్ సినిమా లను రూపొందించే అవకాశాలు కూడా లేక పోలేదు.అందుకే ముందు ముందు తెలుగు సినిమా లు వరుసగా పెద్ద ఎత్తున జాతీయ అవార్డులను అందుకునే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుందని నెటిజన్స్ మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇకపై తెలుగు ఆడియన్స్ జాతీయ అవార్డు ల విషయం లో నిరాశ వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు.







