టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి, బాలయ్యలకు( Megastar Chiranjeevi ) ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ ఇద్దరు హీరోలు వరుసగా భారీ సినిమాలలో స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోల సినిమాలకు సైతం ఒకే రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది.అయితే చిరంజీవి రెమ్యునరేషన్, బాలయ్య రెమ్యునరేషన్ మధ్య వ్యత్యాసం మాత్రం ఎక్కువగానే ఉంది.

అయితే భోళా శంకర్ సినిమా ఈవెంట్ సమయంలో చిరంజీవి కీర్తి సురేష్ ను కౌగిలించుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ కాగా తాజాగా జరిగిన స్కంద ఈవెంట్ బాలయ్య శ్రీలీలను( Balakrishna ) ఆశీర్వదించడం జరిగింది.ఈ ఫోటోలు వైరల్ కాగా చిరంజీవి, బాలయ్య మధ్య తేడా ఇదేనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.హీరోయిన్లను హీరోలు కౌగిలించుకోవడంలో తప్పేం లేకపోయినా కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లి పాత్రలో నటించడంతో ఈ కామెంట్లు వచ్చాయి.

అయితే ఈ కామెంట్ల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బాలయ్య స్కంద మూవీ ఈవెంట్( Skanda ) లో రామ్ గురించి, బోయపాటి గురించి గొప్పగా చెప్పారు. బోయపాటి శ్రీనుపై ఉన్న అభిమానంతో బాలయ్య ఈ ఈవెంట్ కు హాజరైనట్టు తెలుస్తోంది.
రామ్ మొదటి సినిమా దేవదాస్ కు గెస్ట్ గా హాజరైన బాలయ్య దాదాపుగా 15 సంవత్సరాల తర్వాత మళ్లీ రామ్ సినిమాకు గెస్ట్ గా హాజరయ్యారు.స్కంద సినిమాతో ష్యూర్ షాట్ హిట్ సాధిస్తానని రామ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
ఈ సినిమాతో మాస్ ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో క్రేజ్ పెరుగుతుందని ఫీలవుతున్నట్టు తెలుస్తోంది.స్కంద టైటిల్ పై మిక్స్డ్ రెస్పాన్స్ వస్తున్నా సినిమా మాత్రం వేరే లెవెల్ లో ఉండనుందని తెలుస్తోంది.
రామ్ కు భారీ సక్సెస్ దక్కాలని అభిమానులు ఫీలవుతున్నారు. చిరంజీవి, బాలయ్య కలిసి నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.







