స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజలు గర్వించదగ్గ మహోన్నతమైన వ్యక్తులలో ఒకరు.ఈయన స్టార్ హీరోగా సినిమాల్లో తన విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.
ఈయన ఎన్నో సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుని తెలుగు సినీ పరిశ్రమకు కూడా తన వంతు సహాయం చేసారు.సినిమాల్లో నందమూరి తారక రామారావు( N .T.Rama Rao ) గారి తర్వాతనే ఎవరైనా అని చెప్పాలి.అంత ఎత్తుకు ఎదిగిన ఈయన ప్రజలకు మంచి చేయాలని ఆ తర్వాత రాజకీయాల్లోకి కూడా వచ్చారు.రాజకీయాల్లో కూడా కొత్త వరవడి సృష్టించి అనతి కాలంలోనే ముఖ్యమంత్రిగా కూడా చేపట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.
ఇక ఈయన శతజయంతి వేడుకలు ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు.

నందమూరి కుటుంబ సభ్యులు మాత్రమే కాదు సినీ, రాజకీయాల్లో కూడా పార్టీలకు అతీతంగా ఈయన శత జయంతి వేడుకలు జరిగాయి.ఈ ఏడాదితో ఈయన 100 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలను నిర్వహించారు.కాగా ఎన్టీఆర్ ముద్ర కలిగిన 100 రూపాయల నాణాన్ని ఆయనకి ప్రతీకగా గౌరవార్ధం కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐతో ఈ నాణాన్ని లాంచ్ చేస్తున్నారు.

ఈ నాణెం విషయంలో ఇప్పుడు ఎట్టకేలకు లాంచ్ జరగనుంది.ఆగస్టు 28న ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా( Droupadi Murmu ) ఆవిష్కరించగా ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబం నుండి బాలయ్య, ఎన్టీఆర్, పురందేశ్వరి, చంద్రబాబులకు ఆహ్వానం అందినట్టు తెలుస్తుంది.మరి ఈ నాణెం 100 రూపాయల నాణెం కాగా 100 శాతం లోహంతో దీనిని తయారు చేస్తున్నట్టు టాక్.అందులో 50 శాతం సిల్వర్, 40 శాతం కాపర్, 5, శాతాల్లో నికెల్, జింక్ లోహాలతో సరిగ్గా 100 శాతం వచ్చేలా తయారు చేసినట్టు తెలుస్తుంది.







