టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు.తాను విమర్శలకు భయపడే వాడిని కాదని చెప్పారు.17 ఏళ్ల క్రితమే టీటీడీ ఛైర్మన్ అయిన వ్యక్తినన్న భూమన 30 వేల మందికి సామూహిక వివాహాలు చేయించానని తెలిపారు.మాడవీధుల్లో చెప్పులతో వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది తానేనని వెల్లడించారు.
దళితవాడల్లో శ్రీ వెంకటేశ్వర కల్యాణం చేయించింది కూడా తానేనని పేర్కొన్నారు.తాను నాస్తికుడనని ఆరోపణలు చేస్తున్న వారికి ఇదే తన సమాధానం అంటూ స్పష్టం చేశారు.
ఆరోపణలకు భయపడి మంచి పనులు ఆపేవాడిని కాదని వెల్లడించారు.







