కాస్కోండి.. సెప్టెంబర్ లో ఊర మాస్ సినిమాలే కాదు.. క్లాస్ సినిమాలు కూడా రిలీజ్!

సెప్టెంబర్ నెల కూడా రాబోతుంది.ప్రతీ నెల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తూనే ఉంటాయి.

 September 2023 Telugu Movies, Salaar, Prabhas, Prashanth Neel, Anushka Shetty, M-TeluguStop.com

మరి వచ్చే నెల కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చాలా మంది వరుసగా తమ సినిమాలతో రాబోతున్నారు.గత రెండు మూడు నెలల కంటే వచ్చే నెల అన్ని పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

ఆగస్టులో అంతగా సినిమాలు ఆకట్టుకోలేక పోయాయి.అందుకే సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు.

మన టాలీవుడ్ నుండి నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ కానున్నాయి.రెండు క్లాస్ సినిమాలు కాగా రెండు ఊర మాస్ సినిమాలు.

ముందుగా సెప్టెంబర్ 1న విజయ్ ఖుషి సినిమాతో( Kushi ) నెల స్టార్ట్ చేయనున్నాడు.విజయ్ దేవరకొండ, సమంత నటిస్తున్న ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి.

ఇక ఆ తర్వాత వారం నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటిస్తున్న మూవీ ”మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి( Miss Shetty Mr Polishetty )” రిలీజ్ కాబోతుంది.సెప్టెంబర్ 7న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.ఖుషి, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలు క్లాస్ అండ్ లవ్ స్టోరీస్ గా ప్రేక్షకులను ఆకట్టు కునేందుకు రానున్నాయి.ఫ్యామిలీ మొత్తం చూసే విధంగా ఈ రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి.

ఇక మాస్ సినిమాల విషయానికి వస్తే రామ్ స్కంద( Skanda ) సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది.ఈ సినిమాను బోయపాటి తెరకెక్కించగా భారీ అంచనాలు ఉన్నాయి.ఇక నెల చివరిగా మరింత యాక్షన్ అండ్ పవర్ ప్యాక్డ్ మూవీ సలార్ రాబోతుంది.సెప్టెంబర్ 28న ఈ సినిమా రిలీజ్ కానుంది.ప్రభాస్ హీరోగా, నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలతో సెప్టెంబర్ బాక్సాఫీస్ అయితే కళకళ లాడనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube