అసలే ద్రవ్యోల్బణం, ఆర్ధిక వ్యవస్థ ఒడిదొడుకులు, నిరుద్యోగం వంటి సమస్యలతో సతమతమవుతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు( Joe Biden ) తాజాగా మరో సమస్య ఎదురైంది .డెట్రాయిట్ ( Detroit )నగరం కేంద్రంగా పనిచేస్తున్న మూడు దిగ్గజ ఆటో కంపెనీలకు( auto companies ) చెందిన కార్మికులు సమ్మె సైరన్ మోగించారు.
వచ్చే నెలలో గడువులోగా ఒప్పందం కుదరని పక్షంలో సమ్మెకు దిగుతామని శుక్రవారం యూనియన్ ప్రతినిధులు వెల్లడించారు.జనరల్ మోటార్స్, ఫోర్డ్, స్టెల్లాంటిస్లలో సమ్మెకు కనీసం 95 శాతం మంది కార్మికులు మద్ధతు తెలిపినట్లుగా యునైటెడ్ ఆటో వర్కర్స్ తెలిపింది.
సెప్టెంబర్ 14న విధించిన గడువులోగా ఒప్పందాన్ని రూపొందించడంలో విఫలమైతే .ఈ మూడు కంపెనీలలో సగటున 97 శాతం మంది కార్మికులు సమ్మెకు దిగనున్నారు.
సమ్మెపై జరిగిన ఓటింగ్ కారణంగా యూఏడబ్ల్యూ ప్రెసిడెంట్ షాన్ ఫైన్‌కు( Shawn Fine, President of the UAW ) కంపెనీల యాజమాన్యాలతో చర్చలలో అదనపు బలాన్ని ఇస్తుంది.ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో కంపెనీలు పట్టు విడవటం లేదని ఫైన్ విమర్శించారు.కార్పోరేట్ ఎలైట్, బిలియనీర్ క్లాస్ బందిపోట్ల వలే వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
మూడు కంపెనీలకు చెందిన దాదాపు 1,50,000 మంది కార్మికులు సమ్మెలో పాల్గొనడం వల్ల ఆర్ధికంగా తీవ్ర ప్రభావం వుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఎలక్రిక్ వాహనాల( Electric vehicles ) పరివర్తన నేపథ్యంలో కార్మికుల హక్కులను బలపరిచేటటువంటి న్యాయమైన ఒప్పందానికి ఇటీవల అధ్యక్షుడు జో బైడెన్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ఆటో ఎగ్జిక్యూటివ్‌లకు ఇచ్చే 40 శాతం వేతనాన్ని కార్మికులు కూడా పొందేలా చూడాలని ఫైన్ వాదించారు.
ఇతర డిమాండ్లలో జీవన వ్యయ సర్దుబాటుల పునరుద్ధరణ (సీవోఎల్ఏ), కార్మికులందరికీ పెన్షన్ల హామీ, మల్టీటైర్డ్ కాంపెన్సేషన్ సిస్టమ్( Multitiered Compensation System ) తొలగింపు వంటివి వున్నాయి.కాగా.
ఇండియానాలోని స్టెల్లాంటిస్ ఫ్యాక్టరీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసిన 54 ఏళ్ల ఫైన్ తొలి యూఏడబ్ల్యూ అధ్యక్ష ఎన్నికల్లో ర్యాంక్ అండ్ ఫైల్ సభ్యుల ప్రత్యక్ష ఓటింగ్‌తో గెలిచారు.అవినీతి కుంభకోణంలో ఇద్దరు మాజీ యూఏడబ్ల్యూ అధ్యక్షులకు జైలు శిక్ష విధించిన తర్వాత ఓటింగ్‌ను కోర్ట్ నియమించిన మానిటర్ పర్యవేక్షించారు.