ఆ పని చేయకుండా అస్సలు నిద్రపోను.. హీరోయిన్ హన్సిక షాకింగ్ కామెంట్స్ వైరల్!

ఆపిల్ బ్యూటీ హన్సిక ( Hansika )గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.దేశముదురు,( Desamuduru ) కంత్రి, బిల్లా, కందిరీగ మరికొన్ని సినిమాలలో హన్సిక నటించగా ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో బిజీగా ఉన్నారు.

 Heroine Hansika Shocking Comments About Her Habits Details Here Goes Viral, Desa-TeluguStop.com

కొంతకాలం క్రితం పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ పెళ్లి తర్వాత సంతోషంగా జీవనం సాగిస్తున్నారు.తాజాగా హన్సిక తన అలవాట్ల గురించి షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

హన్సిక( Hansika ) మాట్లాడుతూ తనకు రొమాంటిక్ సినిమాలు అంటే ఎంతో ఇష్టమని అన్నారు.ఇప్పటికే నేను చాలా రొమాంటిక్ సినిమాలను చూశానని ఆమె కామెంట్లు చేశారు.ప్రస్తుతం ఓటీటీలలో వెబ్ సిరీస్ లను చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నానని హన్సిక తెలిపారు.ఏదైనా వెబ్ సిరీస్ నచ్చితే ఆ వెబ్ సిరీస్ పూర్తయ్యే వరకు అస్సలు నిద్రపోనంటూ హన్సిక షాకింగ్ కామెంట్లు చేయడం గమనార్హం.

సాధారణంగా వెబ్ సిరీస్( Web series ) అంటే 4 నుంచి 5 గంటలు ఉంటుంది.ఎంతో ఓపిక ఉంటే తప్ప అంత సమయం పాటు వెబ్ సిరీస్ ల కోసం సమయం కేటాయించడం సులువు కాదు.అయితే హన్సిక మాత్రం వెబ్ సిరీస్ లోని ఎపిసోడ్లు నచ్చితే వెబ్ సిరీస్ పూర్తయ్యే వరకు వెనక్కు తగ్గనని చెబుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.ఏదైనా కారణాల వల్ల వెబ్ సిరీస్ ను పూర్తి చేయలేకపోతే ఏదోలా అనిపిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు.

వెబ్ సిరీస్ ను నేను పూర్తి చేయకపోతే ఇంకో పని చేయాలన్నా వెంటనే చేయలేనని ఆమె షాకింగ్ కామెంట్లు చేశారు.హన్సిక చెప్పిన విషయాలు సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతున్నాయి.

హన్సిక తాజాగా మైత్రీ అనే సిరీస్ లో నటించగా ఆ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాలను వెల్లడించడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube