ఇటీవలే కాలంలో కొత్త పరిచయాలు ప్రేమగా మారి నిలువునా ముంచేస్తున్నాయి.అపరిచిత వ్యక్తిని గుడ్డిగా నమ్మితే తమని తాము మోసం చేసుకున్నట్టే అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.ఫేస్ బుక్( Facebook ) పరిచయం తో వ్యక్తి ఏకంగా రూ.20 లక్షలు సమర్పించుకొని, చివరికి తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.

వివరాల్లోకెళితే.విశాఖపట్నం( Visakhapatnam )లో అకౌంటెంట్ గా పనిచేస్తున్న కంఠమణి వెంకట విష్ణు కుమార్ కు ఫేస్ బుక్ ద్వారా రాజమహేంద్రవరానికి చెందిన బోల్లంకొండ వెంకట సాయి లక్ష్మి( Venkata Sai Lakshmi ) పరిచయం అయింది.ఇద్దరూ కూడా తరచూ వీడియో కాల్స్ మాట్లాడుకునేవారు.
వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది.తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని విష్ణు కుమార్ కు మాయ మాటలు చెప్పి నమ్మించింది.
త్వరలో పెళ్లికూడా చేసుకుందామని చెప్పడంతో విష్ణుకుమార్, వెంకట సాయిలక్ష్మి మాటలను నమ్మేశాడు.ఇక విడతలవారీగా పలుసార్లు తన అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయించుకుంది.
ఆన్లైన్లో పలు రకాల వస్తువులు కొనుగోలు చేసి ఆ బిల్లులను విష్ణుకుమార్ తో కట్టించింది.

విష్ణు కుమార్( Vishnu Kumar ) ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తెచ్చిన ఏవో మాటలు చెప్పి వాయిదా వేస్తూ వచ్చేది.పెళ్లి గురించి తన భావ వెంకట తిరుమలేశ్వరావు తో మాట్లాడిస్తానని చెప్పి రూ.2 లక్షల సొమ్మును తన అకౌంట్లో జమ చేయించుకుంది.మళ్లీ తన స్నేహితురాలు ప్రీతి ఫోన్ నెంబర్ ఇచ్చి ఆమె అకౌంట్ కు రూ.2.50 లక్షలు బదిలీ చేస్తేనే వివాహం చేసుకుంటానని తెగేసి చెప్పేసింది.కానీ విష్ణు కుమార్ ప్రీతి అకౌంట్ కు డబ్బులు చెల్లించకుండా తనను మోసం చేస్తుందని గ్రహించి అమౌంట్ బదిలీ చేయనని తెగేసి చెప్పేశాడు.
ఇక వెంటనే వెంకట సాయి లక్ష్మి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది.దీంతో పోలీసులను ఆశ్రయించిన విష్ణు కుమార్ పలుమార్లు వివిధ రకాలుగా రూ.20 లక్షల వరకు వెంకట సాయి లక్ష్మికి ఇచ్చినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.







