జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే.అంతేకాకుండా ఎంతోమంది ఆర్టిస్టులకు ఈ జబర్దస్త్ లైఫ్ ను ఇచ్చింది అని చెప్పవచ్చు.
జబర్దస్త్ షో ద్వారా కొందరు వెండితెరపై అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుండగా మరికొందరు బుల్లితెరకే పరిమితం అయ్యారు.కాగా జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో జబర్దస్త్ శాంతి స్వరూప్( Shanthi swaroop ) కూడా ఒకరు.
జబర్దస్త్ లో ఎన్నో స్కిట్ లలో లేడీ గెటప్ లు వేసి తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శాంతి స్వరూప్.

తనపై ఎంత మంది ఎన్ని విధాలుగా కామెంట్స్ చేసినా కూడా పాజిటివ్ గా తీసుకుంటూ ప్రేక్షకులు నవ్విస్తూ వస్తున్నాడు.లోపల ఎన్ని బాధలు ఉన్నా కూడా వాటిని పైకి కనిపించకుండా చిరునవ్వు చిందిస్తూ తాను నవ్వడంతో పాటు నలుగురిని నవ్విస్తున్నాడు శాంతి స్వరూప్.ఇది ఇలా ఉంటే తాజాగా శాంతి స్వరూప్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియా( Social media )లో చక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే.కష్టపడి సంపాదించిన రూపాయి రూపాయి పోగేసుకుని ఆ మధ్య ఎంతో ఇష్టపడి ఒక ఇల్లు కొనుక్కున్నాను అంటూ అతడు చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు ఆ ఇంటిని అమ్మేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా అతడే స్వయంగా వెల్లడించాడు.

తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆమెకు శస్త్ర చికిత్స అవసరమని సర్జరీ కోసం తన వద్ద డబ్బు లేకపోవడంతో ఇంటిని అమ్మేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో( Instagram ) షేర్ చేసిన వీడియోలో తెలిపాడు.ఈ విషయం తన తల్లికి తెలియదని, ఆమె కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని చెప్పుకొచ్చాడు.తను ఇంటిని అమ్మేస్తున్న విషయం అమ్మకు తెలిస్తే అస్సలు ఒప్పుకోదని చెబుతూ కన్నీరు పెట్టుకున్నాడు.
ఈ వీడియో చూసిన నెటిజన్స్ అతడికి మద్దుతుగా కామెంట్లు చేస్తున్నారు.అధైర్యపడకు అమ్మగారు త్వరగానే కోలుకుంటారు అంటూ ధైర్యం చెబుతున్నారు.
అమ్మ కోసం మీరు చేస్తున్న త్యాగం గొప్పదంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఇంకొందరు మాత్రం సినిమా ఇండస్ట్రీలో కొందరు అతని బాధను తెలుసుకొని సహాయం చేస్తే బాగుంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.







