“ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి” సాధ్యమేనా ?

ఇప్పటికే రెండు పర్యాయాలు తెలంగాణను ఏకచత్రాధిపత్యం తో ఏలిన కేసీఆర్( CM KCR ) ఇప్పుడు మూడోదఫా ఎన్నికలకు సిద్ధమయ్యారు .రెండుసార్లు పాలించిన ప్రభుత్వ వ్యతిరేక ఒకవైపు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల ఫలితాలు మరోవైపు తోడు వస్తూ ఉండగా ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

 Is A “joint Opposition Candidate” Possible, Cm Kcr , Dalit Bandhu , Kodandar-TeluguStop.com

ముఖ్యంగా తాగునీటి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, తెలంగాణ తలసరి ఆదాయం పెంచగలగటం, 24 గంటలు కరెంటు,వ్యవసాయానికి ఉచిత కరెంటు రైతులకు ఇవ్వగలవటం, రైతు రుణమాఫీ ,దళిత బంధు వంటి పథకాల ద్వారా పాజిటివ్ ఓటు బ్యాంకును సృష్టించుకున్న కేసీఆర్ ఇటీవల ఆర్టీసీ విలీనం( RTC merger ) అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు .

Telugu Cm Kcr, Congress, Dalit Bandhu, Kodandaram, Rtc Merger, Ts-Telugu Politic

అయితే మంత్రులు అవినీతి, ప్రభుత్వ అహంకార చర్యలు, అనేక వర్గాలకు ఇచ్చిన హామీలలో మొండి చేయి చూపించడం, సంక్షేమ పథకాలు అమలులో ఉన్న లోపాలను సరిగా సవరించకపోవడం వంటి అంశాలు కేసీఆర్ ప్రభుత్వానికి ప్రతికూలంగా మారాయి.అయినప్పటికీ తన రాజకీయ చాణిక్యంతో చివరి నిమిషంలో కూడా అనేక దిద్దుబాట్లు చేసుకుంటున్న కేసీఆర్ ప్రతిపక్షాలు అందుకోలేనంత వేగంగా ముందుకు వెళుతున్నారు.ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు చివరి నిమిషపు సర్దుబాట్లపై దృష్టి పెట్టారు .

Telugu Cm Kcr, Congress, Dalit Bandhu, Kodandaram, Rtc Merger, Ts-Telugu Politic

అయితే ఎట్టి పరిస్థితులలోనూ కేసీఆర్ను ఓడించాలని భావిస్తున్న ప్రతిపక్షాలకు ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరాం( M.Kodandaram ) ఒక కొత్త ఐడియా ఇచ్చారు.ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని ఎన్నుకొని అందరూ మద్దతు ఇస్తే కేసీఆర్ అహంకారాన్ని ఓడించ వచ్చంటూ ఆయన ప్రతిపాదన చేశారు.దీనికి ఇటీవల కేసీఆర్ చేతిలో భంగపడిన కమ్యూనిస్టు పార్టీలు కూడా అంగీకరించాయి.

అయితే ప్రధాన ప్రతిపక్షాలు ఈ ప్రతిపాదనకు ఎంతవరకు ఒప్పుకుంటాయన్నది పెద్ద ప్రశ్నగా మారింది.ఒకవేళ ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా నిలబడినా కూడా కేసీఆర్ను ఓడించడం అన్నది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అసాధ్యమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి .అయితే కేవలం ఈ పేరు చెప్పి తనను ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించుకోవడానికే కోదండరామ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న వారు లేకపోలేదు.మరోపక్క ఎర్రన్నలు కూడా కాంగ్రెస్తో కలిసి నడవడానికి దీన్నోక అవకాశంగా భావిస్తున్నాయంటూ విశ్లేషణలు వస్తున్నాయిమరి కేసీఆర్ పై ఉమ్మడి అభ్యర్థి ఎంతవరకు సాధ్యమవుతారో చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube