వ్యవసాయ రంగంలో కొత్త కొత్త మార్పుల వల్ల శ్రమతో పాటు పెట్టుబడి ఆదా అవుతోంది.రైతులు( Farmers ) కూడా నూతన పద్ధతులలో సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
మన రెండు తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగు అవుతున్న పంటలలో వరి పంట( Rice crop ) అగ్రస్థానంలో ఉంది.వరి పంటను సాంప్రదాయ పద్ధతిలో కాకుండా.
నీటి వినియోగం, పెట్టుబడి వ్యయం తగ్గించుకొని మెట్ట పద్ధతిలో సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.ఈ వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేయడం వల్ల ఒక ఎకరాకు దాదాపుగా 5 వేలకు పైనే పెట్టుబడి ఆదా అవుతుంది.
అంతేకాదు తక్కువ సమయంలో పంట చేతికి రావడం, దిగుబడి పెరగడం జరుగుతుంది.
పాత పద్ధతులలో వ్యవసాయం చేయడం వలన అన్నదాతలకు ఎక్కువ శ్రమ, పెట్టుబడి వ్యయం అధికం అవుతూ.దిగుబడి మాత్రం అంతంత మాత్రంగానే ఉందని వ్యవసాయ క్షేత్రం నిపుణులు చెబుతున్నారు.ఈ క్రమంలో వరి సాగులో సంప్రదాయ పద్ధతులను పక్కనపెట్టి, పొడి దుక్కిలో నేరుగా వెదజల్లే విధానంలో వరి సాగు చేయడం వల్ల మంచి లాభాలు పొందవచ్చని చెబుతున్నారు.
నేరుగా వెదజల్లే పద్ధతిలో సాగు చేయాలనుకుంటే ఒక ఎకరాకు 20 కిలోల విత్తనాలు అవసరం.ఈ పద్ధతిలో సాగు చేస్తే పంట పది రోజులు ముందుగానే కోతకు వస్తుంది.
ఈ పద్ధతిలో నారు పెంపకం( Fiber cultivation ), నారు పీకడం,నాట్లు వేయడం అనే పనులు ఉండవు కాబట్టి ఎకరానికి రూ.5 వేల వరకు పెట్టుబడి వ్యయం ఆదా అవుతుంది.పైగా మొక్కల సాంద్రత సరిపడా ఉండడంవల్ల 10 శాతం దిగుబడి పెరిగే అవకాశం ఉంది.ఈ పద్ధతిలో కూలీల కొరతను అధిగమించవచ్చు.కానీ ఈ వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తే కలుపు సమస్య ( Weed problem )అనేది అధికంగా ఉంటుంది.ఎప్పటికప్పుడు కలుపు నిర్మూలన చర్యలు చేపట్టాలి.
వరి పంటకు నత్రజని, భాస్వరం, పోటాష్ ఎరువులు అవసరం.వీటితోపాటు సూక్ష్మ పోషకాల లోపాలు లేకుండా జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడి పొందవచ్చు.