టీడీపీ తో బంధం పూర్తిగా తెగినట్టేనా ? కేశినేని దారెటు ?

విజయవాడ టిడిపి ( TDP )ఎంపీ కేశినేని నాని ( Kesineni nani )వ్యవహారం ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.పార్టీలోనే ఉంటూ, పార్టీలోని నాయకులు, అధిష్టానం తీరుపై చాలాకాలంగా నాని అసంతృప్తితో ఉంటూ వస్తున్నారు.

 Is The Bond With Tdp Completely Severed Kesineni , Kesineni Nani, Kesineni Chi-TeluguStop.com

ముఖ్యంగా తనకు వ్యతిరేకవర్గంగా ఉన్న వారిని టిడిపి అధిష్టానం ప్రోత్సహిస్తుండడంపై నాని తీవ్ర అసంతృప్తితో ఉంటూ.పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

అంతే కాకుండా , వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తనకు బదులుగా,  తన సోదరుడు కేశినేని చిన్నికి విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు టిడిపి అధిష్టానం సిద్ధమవుతుండడం వంటివి నానికి మరింతగా ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.అందుకే చాలా కాలంగా పార్టీలో ఉన్నా లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు.

అనేక సందర్భాల్లో అధిష్టానం తీరుపై బహిరంగంగానే అసంతృప్తిని వెళ్ళగక్కారు.

Telugu Bonda Uma, Budda Venkanna, Devine Uma, Kesineni Chinni, Kesineni Nani, Te

ముఖ్యంగా టిడిపిలో లోకేష్( Lokesh Nara ) వర్గంగా పేరుపొందిన బుద్ధ వెంకన్న, బోండా ఉమ , దేవినేని ఉమామహేశ్వరరావు లతో నానికి వైరం నెలకొంది.బహిరంగంగా ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్న పరిస్థితి అనేక సందర్భాల్లో చోటుచేసుకుంది.ఇది ఇలా ఉంటే .కొద్ది రోజుల క్రితం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగినా,  దానికి నాని దూరంగా ఉన్నారు.దీనికి కారణం నాని వ్యతిరేకిస్తున్న నాయకులు ఈ యాత్ర నిర్వహణ బాధ్యతలు చూస్తూ ఉండడమేనని ఆయన అనుచరులు చెబుతున్నారు.

నాని లోకేష్ యాత్రకు దూరంగా ఉన్నా,  ఆయన సోదరుడు కేశినేని చిన్ని మాత్రం అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుని యాత్రను సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషించారు.ఈ వ్యవహారం ఇలా ఉండగానే,  కేంద్ర ప్రభుత్వం స్ఫూర్తి పథకం కింద ఓ కార్యక్రమాన్ని చేపట్టింది.

దీనిలో భాగంగానే తన ఎంపీ లార్డ్స్ నిధులతో కొండపల్లి బొమ్మల తయారీ,  వాటి విక్రయాలకు సంబంధించిన భవన సముదాయాన్ని ఎంపీ నాని ఆధ్వర్యంలో నిర్మించారు.దీనిని  నాని ప్రారంభించనున్నారు.

Telugu Bonda Uma, Budda Venkanna, Devine Uma, Kesineni Chinni, Kesineni Nani, Te

 అయితే దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికలో ఎక్కడా టిడిపి పేరు లేకుండా నాని జాగ్రత్తపడ్డారు.దీంతో టిడిపిని వీడేందుకే నిర్ణయం తీసుకున్నారు అనే విషయం అందరికీ అర్థమవుతుంది.ఒకవైపు బిజెపి,  మరోవైపు వైసీపీ( YCP ) ల నుంచి నానికి ఆహ్వానాలు అందుతున్నాయి.అయితే ఈ విషయంలో మరి కొంతకాలం వేసి చూడాలని,  ఆ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో నాని ఉన్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube