వైరల్: స్కూటీపై వెంబడించి మరీ దొంగలను పట్టుకున్న పోలీసులు!

మీలో ప్రతి ఒక్కరూ చిన్నపుడు దొంగ, పోలీస్ ఆట ఆడే వుంటారు.పోలీస్ లాగా ఫీల్ అయ్యి ఓ దొంగ( Police ) వెంబడి పరుగెడితే ఆ కిక్కే వేరు కదా? మరి నిజజీవితంలో అలాంటి ఛేజింగ్( Chasing ) జరిగితే ఆ నిజమైన పోలీసులకు ఇంకెంత కిక్ ఉంటుంది చెప్పండి? అవును, దొంగల ఛేజింగ్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది.అయితే వీటిని తరచూ మనం సినిమాల్లో మాత్రమే చూస్తూ ఉంటాం.అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇలాంటి నిజమైన దృశ్యాలను మనం చూడగలుగుతున్నాం.ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో పోలీసులు( Police ) ఓ గజ దొంగను కేవలం పదంటే పదే నిమిషాలలో పెట్టేసుకున్నారు.

 Police Caught Thieves Chasing On Scooty Video Viral Details, Viral Latest, News-TeluguStop.com

ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే దొంగ ఖరీదైన బైక్ మీద వెళుతుంటే పోలీసులు వారిని స్కూటీపై( Scooty ) వెంబడించి పట్టుకోవడం.నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజంగానే జరిగింది.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.వియాత్నంలో( Vietnam ) ఇద్దరు దొంగలు ఏదో దొంగతనం చేస్తూ పట్టు బడ్డారు.

దాంతో వారిని పోలీసులు వెంబడించారు.ఈ క్రమంలో వారు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఒక ఖరీదైన బైకి ఎక్కి అత్యంత వేగంగా రోడ్డుపైన దూసుకుపోతూ ఉంటారు.

ఎంత స్పీడ్ తో వెళుతుంటారంటే కన్ను మూసి తెరిచే లోపే వారు కనిపించకుండా పోతారు.

పోలీసులు మాత్రం తక్కువ తిన్నారా ఏమిటి? ఎట్లాగైనా వారిని పట్టుకోవాలని కసిమీద వెంబడించారు.దొంగలది ఖరీదైన బైక్, పోలీసులది స్కూటీ ఇంకేముంది దొంగలు ఇక దొరికినట్లే అనుకున్నారు అందరూ.అయితే అందరి అంచనాలను తల కిందులు చేస్తూ ఆ దొంగలను పెనుతుఫాన్ లాగ దూసుకెళ్లి వారిని పట్టేసుకున్నారు పోలీసులు.

వేగంగా వెళ్లిన దొంగలు కిందపడిపోతారు.పోలీసులు వెంటనే వారిని పట్టుకుంటారు.

దీనికి సంబంధించిన వీడియో పోలీసుల వాహనం ముందు ఉన్న కెమెరాలో రికార్డు కాగా ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కాగా ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీరు నిజంగా సూపర్బ్ పోలీసులు అంటూ కితాబిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube