ముఖ్యంగా చెప్పాలంటే చింతపండు( Tamarind )ని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే రకరకాల కూరలు, పులిహోర వంటి వాటిని చేసుకోవడానికి కచ్చితంగా చింతపండు ఉండాల్సిందే.
అలాగే చింతపండులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.విటమిన్స్, ఐరన్, పొటాషియం, ఫైబర్,యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా వీటిలో ఎక్కువగా ఉంటాయి.
ముఖ్యంగా చెప్పాలంటే చింతపండుతో చర్మ సమస్యల( Skin problems )ను కూడా దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చే శక్తి చింతపండుకు ఉంది.ముఖ్యంగా చెప్పాలంటే న్యాచురల్ బ్లీచ్ లాగా ఇది పని చేస్తుంది.చింత పండును తీసుకొని పావుగంట వేడి నీటిలో నానబెట్టి మెత్తగా గుజ్జు చేసుకోవాలి.
ఈ గుజ్జులో మీరు అరటి గుజ్జు ( Banana pulp )శనగ పిండి వేసి పేస్టులాగా చేసుకోవాలి.ముఖానికి చేతులకి అప్లై చేసుకుని 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే ఎంతో మంచిది.
ముఖ్యంగా చెప్పాలంటే చింతపండు బ్లీచింగ్ ఏజెంట్ లాగా పని చేస్తుంది.ఇది చర్మాన్ని ఎంతో బాగా శుభ్రపరుస్తుంది.ఇలా చేయడం వల్ల చర్మం పై పేరుకుపోయిన వ్యర్ధాలు తొలగి చర్మం శుభ్రం అవుతుంది.
అంతే కాకుండా చర్మం పై ఉండే డెడ్ స్కిన్ సేల్స్ నీ కూడా ఇది తొలగిస్తుంది.చర్మాన్ని ఎంతో తాజాగా మారుస్తుంది.చింత పండు రసాన్ని తీసుకొని అందులో కొంచెం టీ పొడి వేసుకోవాలి.
ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుని ఈ మిశ్రమాన్ని దూదిలో ముంచి ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల నాచురల్ టోనర్ లాగా ఇది పని చేస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే చింతపండు గుజ్జులో కొంచెం నిమ్మరసం వేసుకొని బేకింగ్ సోడా, పంచదార వేసుకొని మృదువుగా రాసుకోవాలి.
తర్వాత క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల మొటిమలు, ( Pimples )జిడ్డు చర్మం వంటి బాధల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.