ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో చాలా మంది ప్రజలు బయటకి వెళ్లి షాపింగ్ చెయ్యడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.అందరూ ఆన్లైన్ షాపింగ్ కే( Online Shopping ) అలవాటు పడ్డారు.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థల ద్వారా ప్రజలు తమకు నచ్చిన వస్తువులు, దుస్తులు, హోమ్ అప్లియన్సెస్ లాంటి చాలా వస్తువులను ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నారు.అయితే అప్పుడప్పుడు ఆన్లైన్ షాపింగ్ లో కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురవుతుంటాయి.

మనం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వస్తువులకి బదులుగా వేరే వస్తువులు రావడం గమనిస్తూనే ఉంటాం.ప్రస్తుతం అలాంటి సంఘటన ఇప్పుడు ఒకటి జరిగింది.అథర్వ ఖండేల్వాల్ అనే ఒక వ్యక్తి ఆన్‌లైన్ యాప్ అయిన ఫ్లిప్‌కార్ట్ లో( Flipkart ) రూ.76,000 ఖర్చు చేసి యాపిల్ మ్యాక్‌బుక్‌ను( Apple MacBook ) కొనుగోలు చేసాడు.కానీ ఆ మ్యాక్ బుక్ డెలివరీ అవ్వడం ఆలస్యం అయింది.దాంతో ఆ వ్యక్తి ఫ్లిప్‌కార్ట్ హబ్ కి వెళ్లి తన ఆర్డర్ ని తీసుకోవాలనుకున్నాడు.అక్కడికి వెళ్లి ఆర్డర్ డీటెయిల్స్ చెప్పగా డెలివరీ ఏజెంట్ వచ్చి ఆ ప్యాకేజ్ ని అథర్వ ఖండేల్వాల్ కి ఇచ్చాడు.దాంతో వెంటనే అతను ఆ ప్యాకేజీ ని ఓపెన్ చెయ్యగా అందులో యాపిల్ మ్యాక్ బుక్ కి బదులుగా రూ.3,000 విలువ చేసే బోట్ స్పీకర్స్( Boat Speakers ) ఉన్నాయి.

అవి చూడగానే అథర్వ షాక్ అయ్యాడు.ఇక అతను ఆర్డర్ చేసిన వస్తువుకి బదులుగా వేరే వస్తువు వచ్చిందని అథర్వ తను కట్టిన డబ్బులు రిఫండ్ కావాలని కోరగా ఫ్లిప్‌కార్ట్ దానికి నిరాకరించింది.అయితే ఫ్లిప్‌కార్ట్ రూల్స్ ప్రకారం డెలివరీ ఎగ్జిక్యూటివ్ కి ఓటీపీ చెప్పిన తరువాత నే అథర్వ ప్యాకేజీ ని ఓపెన్ చేసాడు.
అంతేకాకుండా ప్యాకేజీ ని ఓపెన్ చేసేటప్పుడు అతను మొత్తం వీడియో కూడా తీసాడు.కానీ అతను రిఫండ్ కోసం ప్రయత్నించగా ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ బాక్స్ వర్తించే ‘ నో రిటర్న్ పాలసీ’( No Refund Policy ) ప్రకారం రిఫండ్ ని వసూలు చెయ్యడం కుదరదు అని ఫ్లిప్‌కార్ట్ చెప్పడం తో అథర్వ తనకి జరిగిన అన్యాయాన్ని ట్విట్టర్ ద్వారా బయటపెట్టాడు.







