తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది.ఈ మేరకు దూకుడు పెంచిన టీ.
కాంగ్రెస్ అధికారంలోకి రావాలనే దిశగా అడుగులు వేస్తుంది.
ఈ క్రమంలోనే వరుస సమావేశాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తుంది.
తాజాగా ఇవాళ హైదరాబాద్ లోని గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు.మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన పార్లమెంట్ నియోజకవర్గాల అబ్జర్వర్ల భేటీ జరగనుంది.ఈ సమావేశంలో పార్లమెంట్ సెగ్మెంట్ ల అబ్జర్వర్లు పాల్గొననున్నారు.దీనిలో ప్రధానంగా నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయంపై చర్చించనున్నారని తెలుస్తోంది.
అదేవిధంగా పార్టీ బలోపేతంతో పాటు తీసుకోవాల్సిన కార్యాచరణపై కూడా చర్చించనున్నారని సమాచారం.







