చూడ్డానికి పొట్టిగా.బబ్లీగా.
క్యూట్ గా.ఉండే నిత్యమీనన్ ( Nithya Menon ) కి చాలామంది అభిమానులు ఉంటారు.మరీ ముఖ్యంగా ఈమె స్మైల్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.గతంలో వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న నిత్యామీనన్ ప్రస్తుతం అవకాశాలు లేక అప్పుడప్పుడు ప్రేక్షకులను పలకరిస్తూ పోతుంది.
అయితే ఈ మధ్యకాలంలో నిత్య మీనన్ పెళ్లి చేసుకోబోతుంది అంటూ కొన్ని వార్తలు కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ వార్తలు పక్కన పెడితే గతంలో ఓ టాలీవుడ్ హీరోని నిత్యామీనన్ పెళ్లి చేసుకునేదట.

కానీ ఆ హీరో అక్క వల్ల వీరి పెళ్లి చెడిపోయింది అని గతంలో కొన్ని వార్తలు వినిపించాయి.ఇక అసలు విషయం ఏమిటంటే.నితిన్ ( Nithiin ) నిత్య మీనన్ కాంబినేషన్లో గుండెజారి గల్లంతయ్యిందే,ఇష్క్ వంటి సినిమాలు వచ్చాయి.ఇక ఈ రెండు సినిమాల్లో నటిస్తున్న టైంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారిందట.
అంతేకాదు గుండెజారి గల్లంతయ్యిందే ( Gundejari gallanthayyinde ) సినిమా తర్వాత నితిన్, నిత్యామీనన్ లు పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నారట.

వీరిద్దరూ రిలేషన్ లో కూడా ఉన్నారట.కానీ అప్పుడే ఎంట్రీ ఇచ్చింది నితిన్ అక్క నికిత( Nikhitha).నిత్య మీనన్ పెళ్లికి ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించినప్పటికీ నితిన్ వాళ్ళ అక్క నికిత మాత్రం అస్సలు ఒప్పుకోలేదట.
అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్ లని పెళ్లి చేసుకోకూడదు అని లేనిపోనివి కల్పించి చెప్పి నితిన్ మనసు మార్చిందట.ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి నితిన్ కి శాలిని ( Shalini )కి పెళ్లయింది.
ఇక నితిన్ అక్క నికిత గనుక ఆ రోజు నితిన్ మనసు మార్చకపోతే కచ్చితంగా నితిన్ నిత్యమీనన్ ల పెళ్లి జరిగేదట.ఇక ఆమె కారణంగానే వీరి పెళ్లికి బ్రేక్ పడిందట.







