ఆంధ్రప్రదేశ్ లోని వైయస్సార్ స్టేడియం వేదికగా మొదలైన ఆంధ్ర ప్రీమియర్ లీగ్( Andhra Premier League ) మ్యాచ్లు పూర్తయ్యాయి.ఈ లీగ్ మ్యాచ్ లో కోస్టల్ రైడర్స్ జట్టు( Coastal Riders ) 16 పాయింట్ల తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
తరువాత ఉత్తరాంధ్ర లయన్స్, రాయలసీమ కింగ్స్ 12 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి.బెజవాడ టైగర్స్, గోదావరి టైటాన్స్ సంయుక్తంగా ఎనిమిది పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాయి.
అయితే మెరుగైన రన్ రేట్ కారణంగా ఉత్తరాంధ్ర లయన్స్ రెండో స్థానంలో, రాయలసీమ కింగ్స్ మూడో స్థానంలో, బెజవాడ టైగర్స్ నాలుగో స్థానంలో నిలిచాయి.

కోస్టల్ రైడర్స్ తో పాటు ఈ మూడు జట్లు ప్లే ఆఫ్స్ కు( Play Offs ) అర్హత సాధించాయి.శుక్రవారం రాయలసీమ కింగ్స్- బెజవాడ టైగర్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.ఉత్తరాంధ్ర లయన్స్- కోస్టల్ రైడర్స్ మధ్య క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది.
రాయలసీమ కింగ్స్ తో( Rayalaseema Kings ) చివరి రౌండ్ లీగ్ మ్యాచ్ లో కోస్టల్ రైడర్స్ జట్టు వీజేడీ పద్ధతిలో 8 వికెట్ల తేడాతో గెలిచింది.రాయలసీమ కింగ్స్ 18 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.

వర్షం కారణంగా 17 ఓవర్లకు 124 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.కోస్టల్ రైడర్స్ 14 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది.కోస్టల్ రైడర్స్ జట్టు బ్యాటర్లైన ప్రణీత్ 64 నాట్ అవుట్ చిరంజీవి 32 నాట్ అవుట్ గా నిలిచి దూకుడుగా ఆడడంతో కోస్టల్ రైడర్స్ విజయం సాధించింది.ప్లే ఆఫ్స్ కు చేరిన జట్లు ఫైనల్ కు చేరి టైటిల్ సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాయి.







