మరి కొద్ది రోజుల్లో రక్షా బంధన్.అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు రక్షాబంధన్( Rakshabandhan ) ఎలా జరుపుకుంటారో అందరికీ తెలిసినదే.
ఎక్కడెక్కడో ఉన్నవారు సైతం ఈ రోజున కలుసుకొని సెలబ్రేట్ చేసుకుంటారు.ఇక రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లకు సోదరులు అనేక రకాల బహుమతులు ఇస్తూ వుంటారు.
ఈ ప్రత్యేకమైన రోజు తోబుట్టువులకు ఎలాంటి బహుమతులు ఇస్తే బావుంటుంది? అనే ఆలోచన చాలామందికి వస్తుంది.కాబట్టి అలాంటివారి కోసమే ఈ కధనం.
మగవారు, ఆడవారు మెచ్చే రకరకాల దుస్తులు ఇప్పుడు మార్కెట్లో, ఆన్ లైన్లో మెండుగా అందుబాటులో కలవు.మీ తోబుట్టువులకు ఇష్టమైన దుస్తులు వెంటనే ఆర్డర్ చేసేయండి.అదే విధంగా ఆడపిల్లలు ఎక్కువగా బంగారం, వెండి అంటే చాలా ఇష్టపడతారు.మీ బడ్జెట్‌ను బట్టి వారికి బంగారం, లేదా వెండి ఆభరణం కొని బహుమతిగా ఇవ్వచ్చు.
అయితే కాస్త బడ్జెట్ ఎక్కువ.ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఫోటో ప్రింటింగ్‌తో టీ షర్ట్ ( T-shirt with photo printing ), మగ్, పిల్లో ఇలాంటివి బహుమతిగా ఇచ్చినా చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది.
ఇక ఆడవారికి హ్యాండ్ బ్యాగ్స్ ( Hand bags )అంటే చాలా ఇష్టం.కాబట్టి ఓ మంచి హేండ్ బ్యాగ్ ఇచ్చి మీ తోబుట్టువులను ఇంప్రెస్ చేయండి.అవును, మీ అక్కచెల్లెళ్లకు రాఖీ గిఫ్ట్‌గా హ్యాండ్ బ్యాగ్ ఇవ్వడం గుడ్ గిప్ట్ ఆప్షన్.ఇంకా వార్డ్ రోబ్‌లో ఉండటానికి ఇష్టపడే కాస్మెటిక్ హాంపర్‌ను కూడా బహుమతిగా ఇవ్వొచ్చు.
ఇక మొక్కలు ఇష్టపడే వారైతే తన రూంలో అలంకరించుకునేలా ఇండోర్ ప్లాంట్ బహుమతిగా ఇస్తే బావుంటుంది.ఇంకా చెప్పాలంటే వాచ్, సెల్ ఫోన్, హెడ్ ఫోన్స్, ఇష్టమైన పుస్తకాలు, ఫ్యాషన్ యాక్ససరీస్ వంటివి ఇవ్వొచ్చు.
ఈ సారి రాఖీ పండుగను ఆగస్టు 30 న జరుపుకుంటున్నారు.డేట్ దగ్గరలోనే ఉంది కాబట్టి ఏం బహుమతి ఇవ్వాలనుకుంటున్నారో త్వరగా ప్లాన్ చేసేసుకోండి మరి.