అనంతపురం జిల్లా తాడిపత్రిలో కాంపౌండ్ వాల్ కోసం రాద్ధాంతం చేస్తున్నారని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.ఈ క్రమంలో మంత్రి పెద్దిరెడ్డి వాస్తవాలు తెలుసుకోవాలన్న ఆయన ఎమ్మెల్యే చెప్పింది నిజం కాదని తెలిపారు.
తాడిపత్రిలో రోడ్డు, ప్రజల సౌకర్యాల కోసం తాను పోరాటం చేస్తున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.ఎమ్మెల్యే చెప్పింది చేయడానికి పోలీస్ బలగమంతా దిగిందని విమర్శించారు.ఈ క్రమంలో మూడు రోజులు పోలీసులకైనా ఖర్చు రూ.25 లక్షలని చెప్పారు.ఇదే డబ్బుతో జూనియర్ కాలేజ్ కాంపౌండ్ వాల్ నిర్మించొచ్చన్నారు.తన మీద అక్రమంగా కేసులు పెట్టారన్న జేసీ పీడీ యాక్ట్ కూడా పెడుతున్నారని మండిపడ్డారు.అయితే కాలేజ్ ప్రహరీ గోడ వ్యవహారంపై జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గీయుల మధ్య గత నాలుగు రోజులుగా వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.