జబర్దస్త్ ( Jabardasth )షో నుంచి ఇప్పటికే చాలామంది కమెడియన్ ( Comedian )లు సినిమా ఇండస్ట్రీ కి వచ్చి వాళ్ల సత్తా ఏంటి అనేది నిరూపించుకుంటున్నారు.అయితే అందులో కొందరు మాత్రం హీరోలుగా కూడా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు…అందులో మొదట గా చెప్పుకునే పేరు సుడిగాలి సుధీర్ ( Sudigali Sudheer )ఈయన ప్రస్తుతం చేస్తున్న సినిమాలకి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది ఇప్పటికే ఆయన చేసిన సాఫ్ట్ వేర్ సుధీర్,గాలోడు లాంటి సినిమాలు ఇండస్ట్రీ లో మంచి విజయాలను అందుకున్నాయి…అందుకే ఇప్పుడు వస్తున్న goat సినిమా మీద కూడా జనాల్లో మంచి అంచనాలు ఉన్నాయి…ఇక ఈ సినిమా మీద సుధీర్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు.

ఇక సుధీర్ తర్వాత సినిమాల్లో చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్న వాళ్లలో గెటప్ శ్రీను ( Getup Srinu )ఒకడు… ఆయన సినిమాల్లో చేస్తున్న మంచి క్యారెక్టర్ల వల్ల ఆయన కి ఇండస్ట్రీ లో కూడా మంచి పేరు వస్తుంది.నిజానికి ఆయన లాంటి వాళ్ళని మెగాస్టార్ తన సినిమాలో తీసుకోవాల్సిన పని లేదు కానీ వాళ్ల ని ఎంకరేజ్ చేయడానికి శ్రీను లాంటి వాళ్ళని చిరు చాలా బాగా ఎంకరేజ్ చేశాడు…ఇక ఇప్పుడు శ్రీను రాజు యాదవ్ అనే ఒక సినిమాలో హీరో గా కూడా చేస్తున్నాడు ప్రస్తుతానికి ఆ సినిమా సెట్స్ మీద ఉంది…ఇక ఈ సినిమా రిలీజ్ అయితే శ్రీను హీరో గా రాణిస్తాడా లేదా అనేది తెలుస్తుంది…

ఇక శ్రీను తో పాటు గా ఆది కూడా చాలా సినిమాల్లో కమెడియన్ గా మంచి క్యారెక్టర్లు చేస్తూ తను కూడ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.ఇక ఇతన్ని కూడా చిరంజీవి బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు… అయితే ఆది కూడా ప్రస్తుతం ఒక సినిమాలో హీరో గా చేస్తున్నాడు.ఆది పంచులకి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు… ఈయన చేసిన సినిమాలు ప్రస్తుతం థియేటర్లలో రచ్చ చేస్తున్నాయి అనే చెప్పాలి…








