నానికి -జ్ఞానోదయం కారణాలేమిటో?

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీతో మెగాస్టార్ చిరంజీవి సఖ్యతతోనే మెలిగారు.రాజకీయ విబేదాల రిత్యా పవన్ కళ్యాణ్ వ్యతిరేకించినప్పటికీ ఒక పెద్ద మనిషి హోదాలో ఇండస్ట్రీ పెద్ద హోదాలో చిరంజీవి( Chiranjeevi ) మాత్రం ఆచితూచి స్పందించేవారు.

 Sudden Change Kodali Nani Towards Chiru , Kodali Nani , Chiranjeevi , Ap Politi-TeluguStop.com

పరిశ్రమ తరపున సమస్యలలో పెద్దన్న పాత్ర పోషిస్తూ ముఖ్యమంత్రితో భేటీ అయిన కమిటీకి కూడా చిరంజీవి నాయకత్వం వహించారు, పలు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చిరు పట్ల వినయం ప్రదర్శించడం మనఒ గమనించవచ్చు.అయితే బోలా శంకర్ మూవీ ఈవెంట్ సందర్భం మెగాస్టార్ ప్రభుత్వ పెద్దలకు చేసిన సూచనలపై తీవ్రస్థాయి ప్రతిఘటన చిరంజీవికి ఎదురైంది.

Telugu Ap, Chiranjeevi, Jana Sena, Kodali Nani, Pawan Kalyan, Praja Rajyam-Telug

అనేక కోణాలలో చిరంజీవిని విమర్శించిన ఎమ్మెల్యేలు, మంత్రులు సలహాలు పవన్ కి చెప్పుకోమంటూ చాలా ఘాటుగా రిప్లై ఇచ్చారు.ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని( Kodali Nani ) అయితే సినిమా ఇండస్ట్రీలో ప్రతి పకోడీ గాడు మాకు సలహాలు ఇస్తున్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు దీనిపై చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు గుడివాడలో ధర్నాలు కూడా చేశారు.అయితే ఉన్నట్టుండి చిరంజీవి పుట్టినరోజు( Chiranjeevi Birthday ) వేడుకలలో ప్రత్యక్షమైన కొడాలి నాని చిరంజీవి అభిమానులకు కేకులు తినిపించడం గమనార్హం .ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూడా చిరంజీవిని విమర్శిస్తే రాజకీయంగా ఏం జరుగుతుందో తనకు తెలుసంటు వ్యాఖ్యానించడం అందర్నీ ఆశ్చర్య పరిచింది .

Telugu Ap, Chiranjeevi, Jana Sena, Kodali Nani, Pawan Kalyan, Praja Rajyam-Telug

అయితే ఉన్నట్టుండి ఇంత జ్ఞానోదయం వెనక కొడాలి నియోజక వర్గం లో వచ్చిన మార్పే కారణం గా తెలుస్తుంది .నాని కి గత ఎన్నికలలో మద్దత్తు ఇచ్చిన కాపు సామాజిక వర్గం ఆయన వాఖ్యలపై మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది .ముఖ్యంగా చిరంజీవి అభిమానులు కాపు సామాజిక వర్గ యువత కొడాలి నాని కి మారిపోతుండడం తో పరిస్థితిని గ్రహించిన కొడాలి నాని రూట్ మార్చుకున్నట్లుగా తెలుస్తుంది .చిరంజీవి పట్ల తనకు అభిమానం ఉందని ప్రభుత్వానికి పెద్దమనిషి హోదాలో సలహాలు ఇచ్చిన మెగాస్టార్ మాటలను తాము పట్టించుకుంటామని ఆయన ప్రజారాజ్యం( Praja Rajyam Party ) సమయంలో తన కార్యాలయం ముందు నుంచి వెళ్తుంటే నేను నమస్కారం చేశాను అంటూ పాత విషయాలను తవ్వి తీసే ప్రయత్నం చేశారు.మొత్తానికి కొడాలి ణాని కి తత్వం బోదపడిందని తెలుస్తుంది .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube