నిత్యామీనన్( Nithya Menen )కేరళ పుట్టి సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటీమణి.సావిత్రి వంటి నటి కి తగ్గ అభినయనేత్రి.
కేవలం తన పాత్రకు ప్రాధాన్యత ఉందా లేదా అని మాత్రమే చూసుకొని సినిమాల్లో నటిస్తుంది నిత్యామీనన్ ఆమె ఒక చిత్రాన్ని ఒప్పుకుంది అంటే ఖచ్చితంగా అందులో ఎంతో కొంత కంటెంట్ ఉంది అని జనాలు నమ్మేంత స్థాయిలో ఆమె సినిమాలో ఉంటాయి.సౌత్ ఇండియాలోని అందరి హీరోయిన్స్ కన్నా కూడా నిత్యామీనన్ చాలా భిన్నమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి.
ఎక్స్పోజింగ్ కి ఆమె ఎన్నో పరిమితులను పెట్టుకుంటుంది.కేవలం డబ్బు వస్తే చాలు ఎలా అయినా నటించొచ్చు అని అనుకోకుండా పర్ఫామెన్స్ కి స్కోప్ ఉండేలా చూసుకుంటుంది.

ఏడేనిమిదేళ్ల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది.మొట్టమొదటిగా ఆమె ఒక ఇంగ్లీష్ సినిమాలో నటించింది ఆ సమయంలో ఆమె 50 వేల రూపాయల రెమ్యూనరేషన్( Remuneration ) తీసుకోవడం విశేషం.అయితే ఆమె ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను అందరి హీరోయిన్స్ లాగా కాదని చాలా వెనుకబడిన వ్యక్తిని అని చెప్పింది.అందుకు గల ఉదాహరణ ఆమె కాళ్లకున్న పట్టీలే అని కూడా తెలిపింది.
చాలా ఏళ్ల క్రితం తాను ఒక జత పట్టిలు కొనుక్కున్నానని అవి లేకుండా ఒక రోజు కూడా ఉండలేనని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ పట్టీలు నా కాళ్ళకే ఉన్నాయని అవి తీయడం తనకు ఇష్టం ఉండదని తెలిపింది.

ఏదైనా షూటింగ్ లో అవసరం అయితే తప్ప ఇప్పటివరకు తాను కాళ్లపై ఆ పట్టీలు తీయలేదని అంత పద్ధతిగా మరియు నేటి హీరోయిన్స్ కి సంబంధం లేకుండా ఉంటానని తాను డబ్బులకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వరని తన జీవితానికి సరిపడా డబ్బుంటే చాలు కానీ లగ్జరీగా బ్రతకాలని ఎప్పుడూ కోరుకోలేదని కేవలం ఒక బీఎండబ్ల్యూ కారు( BMW Car ) మాత్రమే తన దగ్గర ఉన్న అత్యంత లగ్జరీ వస్తువు అని నిత్య మీనన్ తెలిపారు.ప్రస్తుతం నిత్యామీనన్ ఆరం తిరుకల్పన అనే మలయాళ సినిమాలో అలాగే అప్పవిన్ వీసాయి అనే తమిళ సినిమాల్లో నటిస్తున్నారు.







