జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఆ ఆశ ఇప్పటికీ తీరలేదు... కుష్బూ కామెంట్స్ వైరల్!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటి కుష్బూ ( Khushbu ) ఒకరు.ఇలా తెలుగు తమిళ భాష చిత్రాలలో అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించిన కుష్బూ ఇప్పటికి సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

 That Hope Is Still Not Fulfilled In The Case Of Junior Ntr Kushboos Comments Are-TeluguStop.com

ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి యంగ్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తున్నారు.ఇలా ఒకప్పటి స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ఇండస్ట్రీలో తనకు ఎన్టీఆర్ ( NTR ) అంటే చాలా ఇష్టము అంటూ పలు సందర్భాలలో చెప్పిన సంగతి మనకు తెలిసిందే.

Telugu Autograph, Devara, Khushbu, Koratala Shiva-Movie

ఇలా తనకు ఇష్టమైనటువంటి హీరో ఎన్టీఆర్ అని ఆయన సినిమాలలో నటించే అవకాశాలు వస్తే అసలు వదులుకోను అంటూ కుష్బూ పలు సందర్భాలలో తెలియజేశారు.అయితే తాజాగా మరో ఇంటర్వ్యూలో భాగంగా ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అయితే నేను ఎప్పటినుంచో ఎన్టీఆర్ వద్ద ఒక ఆటోగ్రాఫ్ ( Autograph ) తీసుకోవాలని చాలా ఆశగా ఎదురు చూస్తున్నాను కానీ ఇప్పటివరకు నా ఆశ తీరలేదు అంటూ ఈ సందర్భంగా కుష్బూ తెలియజేశారు.

Telugu Autograph, Devara, Khushbu, Koratala Shiva-Movie

కుష్బూ లాంటి ఒక స్టార్ హీరోయిన్ తనకంటే వయసులో ఎంత చిన్నవాడైనటువంటి ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నానని చెప్పడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.దీంతో ఎన్టీఆర్ అభిమానులు తమ హీరోకి ఉన్నటువంటి క్రేజ్ అలాంటిది అంటూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మరి ఎన్టీఆర్ తొందరలోనే కుష్బూ ఈ చిన్న ఆశ నెరవేర్చాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన కొరటాల శివ ( Koratala Shiva ) దర్శకత్వంలో దేవర ( Devara ) సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube