టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి మనందరికీ తెలిసిందే.రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇకపోతే పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్( Akira Nandan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అకిరా సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
గతంలో అకిరా నందన్ సినిమా ఇవ్వబోతున్నాడు అంటూ అనేకసార్లు వార్తలు వినిపించగా ఆ వార్తల్లో నిజం లేదు అంటూ ఎప్పటికప్పుడు ఆ వార్తలను ఖండిస్తూ వచ్చింది తల్లి రేణు దేశాయ్.

దీంతో ఎప్పటికప్పుడు మెగా అభిమానుల ఆశలు నిరాశలు అవుతూనే ఉన్నాయి.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో అకిరా నందన్ ఎంట్రీ కన్ఫామ్ అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఆ వివరాల్లోకి వెళితే.
టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు కె రాఘవేంద్ర రావు( K Raghavendra Rao ) తాజాగా ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.కాగా రాఘవేంద్ర రావు, అతని అల్లుడు శోభు యార్లగడ్డ, దర్శకుడు రాజమౌళి అందరూ నార్వే దేశం వెళ్లారు.
అక్కడ బాహుబలి( Baahubali ) మ్యూజిక్ సింఫనీ ఉంటే వెళ్లారు.ఈ నేపథ్యంలోనే శోభు కుమారుడు, రాఘవేంద్ర రావు మనవుడు కార్తికేయ( Karthikeya ) అలాగే పవన్ కుమారుడు అకిరా నందన్ రాఘవేంద్ర రావుని కలిశారు.

వాళ్ళిద్దరితో కలిసి దిగిన ఫొటోని రాఘవేంద్ర రావు షేర్ చేశారు.అందుకు సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ ఫోర్త్ జనరేషన్ ఆఫ్ బాయ్స్( Fourth Generation Of Boys ) అనే క్యాప్షన్ ని కూడా జోడించారు రాఘవేంద్రరావు.కాగా అకిరా నందన్, కార్తికేయ అమెరికాలోని ఫిలిం స్కూల్ లో ( America Film School ) జాయిన్ అయ్యారు.కలిసి వెళుతున్నారు అని తెలిపారు.దాంతో అకిరా నందన్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని రాఘవేంద్రరావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు వార్తలను తెగ వైరల్ చేస్తున్నారు.ఫిలిం స్కూల్ కి వెళ్తున్నాడు అంటే సినిమాల పైన ఆసక్తి ఉండబట్టే వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు కదా అన్న అంశాన్ని ఇక వైరల్ చేస్తూ అకిరా త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని కూడా కామెంట్స్ చేస్తున్నారు పవన్ అభిమానులు.
మరి ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలి అంటే అధికారికంగా ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే మరి.







