రాజన్న సిరిసిల్ల జిల్లాలో పారదర్శకంగా మద్యం దుకాణాలకు లక్కీ డ్రా

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మద్యం దుకాణాలకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆధ్వర్యంలో దరఖాస్తుదారుల సమక్షంలో జిల్లా ఎక్సైజ్ అధికారులు సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్ లో లక్కీ డ్రా నిర్వహించారు.2023-25 ఎక్సైజ్‌ పాలసీకి సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో 48 మద్యం దుకాణాల కేటాయింపునకు అధికారులు లక్కీ డ్రా ఉదయం 11 గంటలకు ప్రారంభించారు.లాటరీ పద్ధతిన అర్హులను ఎంపిక ప్రక్రియ చేపట్టి ఎంపికైనవారి పేర్లను వెంటనే ప్రకటించారు.

 Lucky Draw For Transparent Liquor Shops In Rajanna Sirisilla District, Lucky Dra-TeluguStop.com

గౌడ కమ్యూనిటీ కి 15 శాతం అనగా (9), ఎస్సీలకు 10 శాతం అనగా (5) మద్యం దుకాణాలకు రిజర్వ్ కాగా , 70% అనగా (34) మద్యం దుకాణాలకు జనరల్ క్రింద కేటాయించడం జరిగింది.

ఎంపికైనవారు ఈ నెల 23లోగా నిర్ణీత వార్షిక లైసెన్స్‌ రుసుంలో ఆరో వంతు చెల్లించాల్సి ఉంటుంది.లైసెన్సుదారులు డిసెంబర్‌ 1 నుంచి కొత్త దుకాణాల్లో అమ్మకాలకు అనుమతిస్తారు.

జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ ,జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎస్ పంచాక్షరి, గులాం ముస్తాఫా, సీఐ ,సిరిసిల్ల ,ఎంపీఆర్ (మరాఠీ పోష్ రాజ) చంద్రశేఖర్,సీఐ ,ఎల్లారెడ్డిపేట ,గుండేటి రాము, సీఐ , వేములవాడ లు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube