తెలంగాణ బీజేపీ మోర్చాల సంయుక్త సమావేశం జరిగింది.ఈ మేరకు బీజేపీ అనుబంధ మోర్చాలు ఎన్నికలకు సిద్ధం కావాలని ఎంపీ లక్ష్మణ్ సూచించారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మోర్చాలదేనని స్పష్టం చేశారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ హయాంలో తెలంగాణకు ద్రోహం జరిగిందని తెలిపారు.
మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు.డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని తెలిపారు.
ఈ క్రమంలో తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.







