వేములవాడ బీఆర్ఎస్ పార్టీలో టికెట్ పంచాయతీ రోజురోజుకు ముదురుతోంది.చలిమెడ లక్ష్మీనరసింహారావుకు టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు చలిమెడ లక్ష్మీనరసింహారావు తన అనుచరులతో సమావేశం అయ్యారు.మరోవైపు తమకే టికెట్ ఇవ్వాలని రమేశ్ బాబు వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు.
దీంతో ఇరు వర్గాల నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.ఇవాళ మధ్యాహ్నం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే వేములవాడ నియోజకవర్గంలో టికెట్ ఎవరికీ కేటాయిస్తారన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







