రింకూ సింగ్ ( Rinku Singh )పరిచయం అక్కర్లేని పేరు.అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించక ముందే క్రికెట్ అభిమానులందరికీ రింకూ సింగ్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.
ఐపీఎల్ స్టార్, భారత జట్టు యువ బ్యాటర్ గా రింకూ సింగ్ తన అంతర్జాతీయ కెరీర్ ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తో ఘనంగా ఆరంభించాడు.ఐర్లాండ్ తో ( Ireland ) తొలి టీ20 మ్యాచ్లో రింకూ సింగ్ కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
రెండో టీ20 మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగి 21 బంతులలో 2 ఫోర్లు, 3 సిక్స్ లతో 38 పరుగులు చేశాడు.ఇన్నింగ్స్ ఆరంభంలో నెమ్మదిగా ఆడిన రింకూ సింగ్ చివరి 5 బంతులలో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు.

తొలి ఆరంగేట్ర మ్యాచ్ తోనే ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు( Player Of The Match ) అందుకోవడం చాలా సంతోషంగా ఉందని రింకూ సింగ్ తెలిపాడు.మ్యాచ్ అనంతరం అవార్డు తీసుకున్న రింకూ సింగ్ మాట్లాడుతూ.ఐపీఎల్ లో( IPL ) తాను ఏ విధంగా ఆడాడో అచ్చం అలాగే ఈ మ్యాచ్లో ఆడినట్లు తెలిపాడు.ఐపీఎల్ లో ఒత్తిడి సమయంలో ఆడడం తనకు ఎంతగానో కలిసి వచ్చిందని, తాను ఎంతో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగినట్లు తెలిపాడు.
తాను మైదానంలో ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తానని, కెప్టెన్ ఏం చెబితే అదే చేశానని.

తాను పదేళ్లుగా క్రికెట్ ఆడుతుంటే ఇప్పుడు తనకు ప్రతిఫలం దక్కిందన్నాడు.తాను కనీసం పదేళ్లు భారత జట్టులో కొనసాగుతూ దేశం కోసం ఆడాలన్నదే తన లక్ష్యం అని తెలిపాడు.రింకూ సింగ్ ఐపీఎల్-2023లో 14 మ్యాచులు ఆడి 149.9 స్ట్రైక్ రేట్ తో 474 పరుగులు చేశాడు.ఐపీఎల్ లో ఒక మ్యాచ్ లో చివరి ఓవర్ లో ఏకంగా ఐదు సిక్సులు బాది, ఐపీఎల్ స్టార్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.
ఆ మ్యాచ్ పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ సెలెక్టర్లు తాజాగా ఐర్లాండ్ సిరీస్ లో ఇచ్చిన తొలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.







