తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి( Anushka Shetty ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది అనుష్క.
అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది.టాలీవుడ్ లో ప్రభాస్, నాగార్జున, అల్లు అర్జున్, రవితేజ, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.
ముఖ్యంగా అరుంధతి, బాహుబలి, మిచ్చి, డార్లింగ్ లాంటి సినిమాల ద్వారా అనుష్క మరింత పాపులారిటీ సంపాదించుకోవడంతో పాటు ప్రేక్షకులకు మరింత చేరువ అయింది.

ఇకపోతే అభిమానులు అనుష్కని ముద్దుగా స్వీటీ అని పిలుస్తారన్న విషయం తెలిసిందే.మొన్నటి వరకు సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన అనుష్క ఈ మధ్య సినిమాల స్పీడు తగ్గించేసింది.2019లో చిరంజీవి సైరా సినిమాతో వెండితెరపై మెరిసింది.2020లో నిశ్శబ్ధం( nissabbdham ) అనే సినిమా చేసినా ఇది నేరుగా ఓటీటీలో రిలీజైంది.ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరమై దాదాపు మూడేళ్లు కావస్తోంది.
ఇప్పుడు ఆమె యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి( Miss Shetty Mr.Polishetty ) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో అనుష్క పారితోషికంకు సంబంధించి వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.కాగా గతంలో అనుష్క ఒక్కో సినిమాకు మూడు కోట్ల మేర పారితోషికం తీసుకుంది.అయితే అది అప్పటి ముచ్చట అని తెలుస్తోంది.ఎందుకంటె ఇప్పుడు ఆమె తన రెమ్యునరేషన్ డబుల్ చేసినట్లు తెలుస్తోంది.మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రానికి గాను దాదాపుగా ఆరు కోట్ల మేర పారితోషికం తీసుకున్నట్లుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అనుష్క అభిమానులు స్పందిస్తూ మరి మా స్వీటీ అంటే ఏమనుకున్నారు ఆ మాత్రం ఉండాల్సిందే మరి అంటూ కామెంట్ చేస్తున్నారు.







