నందమూరి కుటుంబంలో తారకరత్న ( Tarakaratna ) మరణ విషాదం తర్వాత శుభకార్యం జరగడంతో నందమూరి హీరోలు అందరూ కూడా ఈ వేడుకలో ఎంతో సందడి చేశారు.దివంగత నటుడు హరికృష్ణ కుమార్తె సుహాసిని( Suhasini ) కుమారుడి వేడుక ఆదివారం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
ఎన్టీఆర్ ( NTR ) కళ్యాణ్ రామ్( Kalyan Ram ) హీరోలకు స్వయాన మేనల్లుడు కావడంతో ఈ పెళ్లి వేడుకలో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అంతా తామై ముందుకు నడిపించారు.ఆదివారం గచ్చిబౌలిలో జరిగిన ఈ వివాహ వేడుకలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ పెళ్లి వేడుకలలో భాగంగా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ బాలకృష్ణ ( Balakrishna ) హీరోలు సందడి చేయడమే కాకుండా పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ పెళ్లి వేడుకలు పాల్గొన్నారు.ఈ పెళ్లి వేడుకలలో ఒక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది.గత కొంతకాలంగా బాలకృష్ణకు ఎన్టీఆర్ మధ్య మనస్పర్ధలు ఉన్నాయి అంటూ వార్తలు వినిపించాయి.అయితే తాజాగా ఈ పెళ్లి వేడుకలో చోటు చేసుకున్నటువంటి సంఘటన నందమూరి బాలయ్య ఎన్టీఆర్ అభిమానులను దిల్ ఖుష్ చేస్తుంది.
త్వరలోనే బాలయ్య వారసుడు మోక్షజ్ఞ( Mokshagna ) సినిమా ఇండస్ట్రీలోకి రాబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే సుహాసిని కుమారుడి పెళ్లి వేడుకలలో భాగంగా మోక్షజ్ఞ కూడా సందడి చేశారు.అయితే మోక్షజ్ఞ కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ముగ్గురు కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.ఇలా ఈ ముగ్గురు హీరోలు ఒకే ప్రేమ్ లో కనిపించడంతో నందమూరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా మోక్షజ్ఞ ఎన్టీఆర్ తో కలిసి కనిపించిన సందర్భాలు ఈ మధ్యకాలంలో అసలు లేదు అలాంటిది ఈ పెళ్లి వేడుకలో ఎన్టీఆర్ తో కలిసి మోక్షజ్ఞ కనిపించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.







