సోమవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ మంత్రి హరీష్ రావుపై ఫైర్ అయ్యారు.తన కుమారుడు మెదక్ లో పోటీ చేసి తీరతాడని, హరీష్ రావు మెదక్ లో పెత్తనం చెలాయిస్తున్నారని,
హరీష్ రావు గతం గుర్తించుకోవాలన్నారు.
హరీష్ రావు బట్టలు ఇప్పే వరకు వదిలిపెట్టనని చెప్పిన ఆయన, సిద్దిపేటలో అవసరమైరే పోటీ చేసి హరీష్ రావు అడ్రస్ లేకుండా చేస్తానని శపథం చేశారు.ట్రంకు డబ్బా, లబ్బరు చెప్పులతో వచ్చిన నీకు లక్ష కోట్లు ఎక్కడి నుండి వచ్చాయో చెప్పాలని, రాజకీయంగా ఎంతో మందిని అణిచివేశావని, మల్కాజ్ గిరిలో నేను పోటీ చేస్తానని, రాజకీయాలు పక్కన పెట్టైనా మెదక్ లో మా అబ్బాయిని ఎమ్మెల్యే ను చేస్తానని ఆయన తెలియజేశారు.