సమంత లేకుండానే కానిచ్చేయనున్నారట!

రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ హీరోగా సమంత( samantha ) హీరోయిన్ గా శివ నిర్వాన దర్శకత్వం లో రూపొందిన ఖుషి సినిమా విడుదలకు ముస్తాబయింది.ఈ సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యం లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.

 Samantha Not Attending To Kushi Pre Release Event , Kushi Movie , Samantha , Pr-TeluguStop.com

ఇటీవలే ఈ సినిమా మ్యూజిక్ కన్సెర్ట్‌ ను నిర్వహించడం జరిగింది.ఆ కార్యక్రమం లో విజయ్ దేవరకొండ మరియు సమంత చేసిన లైవ్‌ డాన్స్ అందరి దృష్టిని ఆకర్షించింది.

అన్ని వర్గాల వారిని మెప్పించే విధంగా ఖుషి సినిమా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చాలా నమ్మకంగా ఉన్నారు.ఆకట్టుకునే కథ మరియు కథనం తో ఖుషి సినిమా( Kushi ) ను రూపొందించినట్లుగా సినిమా ట్రైలర్ ను చూస్తూ ఉంటే అనిపిస్తుంది.

హీరోయిన్ గా సమంత కు ఇది ఎంత ప్రతిష్టాత్మకమో అందరికి తెల్సిందే.అందుకే ఈ సినిమా ను ఆమె కచ్చితంగా భారీ గా ప్రమోషన్ చేస్తుందని అంతా భావించారు.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఖుషి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు సమంత హాజరు అయ్యే అవకాశౄలు కనిపించడం లేదు.ఆమె ఇప్పటికే యూఎస్ వెళ్లి పోయింది.

అక్కడ మయో సైటిస్ కి చికిత్స తీసుకోవడం తో పాటు విశ్రాంతి తీసుకుంటుంది.

వచ్చే ఏడాది వరకు సమంత షూటింగ్ లకు హాజరు అవ్వదు అనే విషయం తెల్సిందే.హీరోయిన్‌ గా సమంత సిటాడెల్‌ తో మంచి విజయాన్ని బాలీవుడ్‌ లో అయినా దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ( Vijay Deverakonda ) చేస్తున్న హడావుడి నేపథ్యం లో ఖుషి సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్‌ అయింది అనడంలో సందేహం లేదు.

సమంత లేకుండానే బ్యాలన్స్ ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube