ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు( Paderu ) ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు లోయలో పడిపోయింది.ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
ఈ దుర్ఘటన పట్ల సీఎం జగన్( CM Jagan ) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఇదే సమయంలో పాడేరు బస్సు ప్రమాద( Paderu Bus Accident ) బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
మృతుల కుటుంబాలకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులకు 5 లక్షలు.గాయపడిన వారికి లక్ష చొప్పున సీఎం జగన్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
కాగా ఈ ప్రమాదంలో గాయపడిన వారికి పాడేరు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.రోడ్డుపై ఉన్న చెట్టు కొమ్మను తప్పించే సమయంలో బైక్ అడ్డురావడంతో సడన్ బ్రేక్ వేయడంతో బస్సు లోయలోకి వెళ్లినట్లు.
ప్రమాదానికి గురి కావటం జరిగిందట.చోడవరం నుంచి పాడేరు వెళ్తుండగా మూలమలుపు వద్ద బస్సు ప్రమాదానికి గురి కావడం జరిగింది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆర్టిసి బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు.బస్సులో లోయలో పడగా అక్కడికక్కడ ఇద్దరు మరణించగా పలువురు పరిస్థితి విషమంగా ఉంది.
దాదాపు పదిమందికి పైగా గాయాలు పాలైనట్లు సమాచారం.







