సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పై అరవింద్ కేజ్రీవాల్ పరోక్ష వ్యాఖ్యలు..!

దేశంలో మరికొద్దిన నెలలో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.జరగబోయే ఈ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ పలు రాష్ట్రాలలో పోటీ చేస్తుంది.

 Arvind Kejriwal's Indirect Comments On Cm Shivraj Singh Chouhan , Arvind Kejriw-TeluguStop.com

ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పర్యటిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ( Aam Aadmi Party ) కార్యకర్తలను అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ఉన్నారు.ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పలు హామీలు కూడా ప్రకటిస్తూ ఉన్నారు.శనివారం నాడు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పర్యటించి.10 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు కల్పిస్తామని అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.

కాగా ఆదివారం మధ్యప్రదేశ్( Arvind Kejriwal ) రాష్ట్రంలో ఓటర్లపై కేజ్రీవాల్ వరాల జల్లు కురిపించారు.మధ్యప్రదేశ్ లో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తే ఉచిత వైద్యం, విద్య, విద్యుత్ అందిస్తామని పేర్కొన్నారు.

అదేవిధంగా నిరుద్యోగ యువతకు నెలకు ₹3000 రూపాయలు భృతి ఇస్తామని ప్రకటించారు.ఇక ఇదే సమయంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్( CM Shivraj Singh Chouhan ) నీ ఉద్దేశించి కేజ్రీవాల్ పరోక్ష వ్యాఖ్యలు చేయడం జరిగింది.“ఇక్కడ ఎవరో మామ ఉంటారని.విన్నా.

కానీ ఆయన తన మేనళ్లుళ్లు, మేనకోడలను మోసం చేశారు.ఆయనను నమ్మకండి అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube