భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి రాగం తారాస్థాయికి చేరిందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే నియోజకవర్గ ఎమ్మెల్యే హరిప్రియ హైదరాబాద్ కు పయనం అయ్యారని తెలుస్తోంది.
ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఇప్పటికే హైదరాబాద్ కు పయనం కాగా మరోవైపు 20 మంది కౌన్సిలర్లు, నాయకులు హైదరాబాద్ నగరానికి బయలు దేరారని సమాచారం.ఈసారి రానున్న ఎన్నికల్లో హరిప్రియకు టికెట్ ఇవ్వొద్దంటూ కౌన్సిలర్లు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారంపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు.ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ఏం చర్యలు తీసుకోనుందోనన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







