చాలా మందికి ఇష్టం లేని కూరగాయ ఏది అంటే అందరూ వెంటనే వంకాయ( brinjal ) అని సమాధానం చెబుతారు.చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు దీన్ని తినాలంటే చాలామంది వెనుకడుగు వేస్తూ ఉంటారు.
కానీ ఇది అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.ఒక రకంగా చెప్పాలంటే దీన్ని పోషకాల పవర్ హౌస్ అని కూడా పిలుస్తారు.
శరీరానికి అవసరమైన విటమిన్ సి నీ ఈ కూరగాయ అందిస్తుంది.ఇది రోగ నిరోధక శక్తి నీ మెరుగు పరుస్తుంది.
చర్మ ఆరోగ్యానికి ఇది చాలా అవసరం.ఇందులోని విటమిన్ కె( Vitamin K ) ఎముకల ఆరోగ్యానికి, రక్తం గడ్డ కట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.బరువు తగ్గాలని అనుకునే వారికి ఇదొక అద్భుతమైన కూరగాయ అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.తక్కువ కేలరీలు, డైటరీ ఫైబర్ ఉండడం వల్ల కాస్త తిన్న పొట్ట నిండుగా ఉంచుతుంది.
ఇక మధుమేహులకి వరం లాంటిది.ఈ కూరగాయ తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగిన కూరగాయ కూడా.
ఇది రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా చేస్తుంది.
వంకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి.
ఇవి సెల్ డ్యామేజ్, ఇన్ఫ్లమేషన్ నుంచి రక్షిస్తాయి.ఫైబర్ కంటెంట్ కారణంగా ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.
మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది.పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వల్ల గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది.
రక్తపోటు( Blood Pressure )ని తగ్గించి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
అయితే వంకాయ వంట చేసే పద్ధతి అందులో ఉపయోగించే పదార్థాలు పరిగణలోకి తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.నూనెలో వేయించడం లేదా ఉడికించడం వల్ల కేలరీలు, కొవ్వు పదార్థాలు గణనీయంగా పెరుగుతాయి.రక్తంలో చక్కెర( Blood Sugar Levels ) నియంత్రణని ప్రభావితం చేస్తుంది.
అందుకే వీటిని గ్రిల్లింగ్ లేదా బేకింగ్ లేదా ఆవిరితో ఉడికించుకొని తినడం వంటి ఆరోగ్యకరమైన పద్ధతులు ఎంచుకోవడం మంచిది.వంకాయ తింటే గర్భిణీ( Pregnant Woman )లకు ప్రయోజనకరంగా ఉంటుంది.
డైటరీ,ఫైబర్, పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజాలను అందిస్తుంది.పిండం అభివృద్ధికి ఫోలేట్ చాలా ముఖ్యం.
రక్త పోటు స్థాయిలు అదుపులో ఉంచడం కోసం పొటాషియం ఎంతో అవసరం.అయితే వంకాయని పూర్తిగా ఉడికించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి.
వంకాయ తింటే అలర్జీ( Allergy ) ఉంటే వాటిని తీసుకోకుండా ఉండడమే మంచిది.ఇందులో చక్కెర కంటెంట్ తక్కువగా ఉండడం వల్ల మధుమేహులు తీసుకోవచ్చు.
కానీ దీన్ని సాస్, స్వీటేనర్ తో కలపకూడదు.వంకాయ అతిగా తినడం వల్ల ఇది విషపూరితం కూడా కావచ్చు.