బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో( Bigg Boss Show ) విషయంలో ప్రేక్షకుల్లో, సెలబ్రిటీలలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.ఎక్కువమంది కెరీర్ కు ఈ షో ప్లస్ కాగా కొంతమంది కెరీర్ కు మాత్రం ఈ షో మైనస్ అయింది.
అయితే విజయ భాస్కర్ అల్లుడిగా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న రవి శివ తేజ( Ravi Shiva Teja ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.అమ్మ, భార్యలలో ఒకరిని ఎంపిక చేసుకోవాలంటే చేసుకోలేమని రవి శివ తేజ అన్నారు.
![Telugu Bigg Boss Show, Ravi Siva Teja, Vijay Bhaskar-Movie Telugu Bigg Boss Show, Ravi Siva Teja, Vijay Bhaskar-Movie](https://telugustop.com/wp-content/uploads/2021/07/Ravi-Shiva-Teja-Marriage-Photos.jpg)
నేను పైకి ఎంత సంతోషంగా కనిపించినా నేను కూడా ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆయన కామెంట్లు చేశారు.ఎవరికీ చెప్పని బాధలు ఎన్నో ఉన్నాయని రవి శివ తేజ తెలిపారు.నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎదురైన అన్ని ఇబ్బందులను నా భార్య( Ravi Shiva Teja Wife ) పరిష్కరించుకుందని ఆయన కామెంట్లు చేశారు.నా భార్యకు ఎప్పుడూ ఐ లవ్ యూ చెబుతానని రవి శివ తేజ కామెంట్లు చేయడం గమనార్హం.బిగ్ బాస్ షోకు వెళ్లే అవకాశం వచ్చిందని అయితే నాకు ఆసక్తి లేకపోవడం వల్ల వెళ్లలేదని రవి శివ తేజ అన్నారు.వెబ్ సిరీస్( Ravi Shiva Teja Webseries ) లలో నటించడం వల్లే నాకు మంచి గుర్తింపు వచ్చిందని ఆయన తెలిపారు.
నా పేరు వెనుక పెద్ద కథ ఉందని ఆయన పేర్కొన్నారు.అమ్మ, నాన్న దగ్గర నాకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవని రవి శివ తేజ అన్నారు.
నా భార్యను నాన్న అని పిలుస్తానని ఆమె బంగారం అని పిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
![Telugu Bigg Boss Show, Ravi Siva Teja, Vijay Bhaskar-Movie Telugu Bigg Boss Show, Ravi Siva Teja, Vijay Bhaskar-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/08/Actor-Ravi-Siva-Teja-Comments-Viral-Social-Media.jpg)
నాకు ఆడపిల్ల అంటే ఇష్టమని ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటానని రవి శివ తేజ వెల్లడించారు.400కు పైగా షార్ట్ ఫిల్మ్స్ లో నేను నటించానని రవి శివ తేజ పేర్కొన్నారు.బిగ్ బాస్ షో నాకు నచ్చదని ఆ షోకు వెళ్తే నాకు విడాకులు ఇస్తానని నా భార్య చెబుతుందని ఆయన కామెంట్లు చేశారు.
రవి శివ తేజ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా( Social Media ) వేదికగా వైరల్ అవుతున్నాయి.